దారుణం…పవన్ కి హీరోయిన్ దొరకడం లేదా..?

  • April 13, 2020 / 06:56 PM IST

పవన్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ కోసం ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వకీల్ సాబ్ చిత్రీకరణ దాదాపు పూర్తయ్యింది. హీరోయిన్ తో కాంబినేషన్ సన్నివేశాలు మరియు ఓ సాంగ్ చిత్రీకరణ మిగిలివుందని టాక్. ఐతే పవన్ కి హీరోయిన్ మాత్రం ఇంత వరకు సెట్టైనట్టు లేదు. వకీల్ సాబ్ మూవీలో హీరోయిన్ గా శృతి హాసన్ చేస్తుందని చాలా రోజులుగా వినిపిస్తున్న మాట. ఐతే ఈ ప్రచారాలను శృతి హాసన్ ఖండించారు. వకీల్ సాబ్ లో తాను నటించడం లేదని తాజాగా ఓ కార్యక్రమంలో తెలియజేశారు.

దీనితో శృతి హాసన్ చేయడం లేదని క్లారిటీ వచ్చినప్పటికి, మరి ఆ హీరోయిన్ ఎవరై ఉంటారా అనే ఆసక్తి ఫ్యాన్స్ లో పెరిగింది. ఈ మూవీ షూటింగ్ మొదలై నాలుగు నెలలు అవుతున్నా హీరోయిన్ ని ఫైనల్ చేయకపోవడం ఆశ్చర్యం వేస్తుంది. దీనితో పవన్ హీరోయిన్ గా చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదని అనిపిస్తుంది. దీనికి కారణం వకీల్ సాబ్ మూవీ లో హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యం ఉండదు. కేవలం పవన్ కళ్యాణ్ హీరో కావడంతో కమర్షియల్ అంశాల కోసం ఒరిజినల్ హిందీ చిత్ర కథకు హంగులు జోడించారు.

చాల తక్కువ నిడివి గల హీరోయిన్ పాత్ర రెండు మూడు సన్నివేశాలు మరియు ఓ పాటకే పరిమితం. అలాగే ఆ పాత్ర చనిపోవడం ద్వారా మద్యలోనే ముగుస్తుంది. కాబట్టి ఫార్మ్ లో ఉన్న హీరోయిన్స్ ఈ పాత్ర చేయడానికి ఒప్పుకోరు. కావున వకీల్ సాబ్ లో పవన్ హీరోయిన్ గా ఫేడ్ అవుట్ అయిన సీనియర్ హీరోయిన్ ని తీసుకోవాల్సిందే. కానీ హీరో పవన్ కావడంతో వారు ఓ మోస్తరు ఇమేజ్ ఉన్న హీరోయిన్ ని ఈ పాత్ర కోసం ట్రై చేస్తున్నారు. మరి చూడాలి పవన్ భార్య గా వకీల్ సాబ్ లో ఎవరు నటిస్తారో…?

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus