Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

ఈ మధ్య కాలంలో సుహాస్ నటించిన సినిమాలు అంతగా ఆడలేదు. వాటి టాక్ కూడా తేడా కొట్టడం వల్ల బాక్సాఫీస్ వద్ద నిలబడలేదు అని అర్ధం చేసుకోవచ్చు. అయితే కొంచెం వెనక్కి వెళితే.. ‘రైటర్ పద్మభూషణ్’ ‘అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు’ వంటి సినిమాలు థియేట్రికల్ సక్సెస్ లు అందుకున్నాయి. ‘జనక అయితే గనక’ కూడా బాగానే ఆడింది. సో సుహాస్ నుండి మంచి కంటెంట్ వస్తే.. థియేటర్లలో నిలబడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.

Hey Balwanth

సుహాస్ లేటెస్ట్ మూవీ ‘హే బల్ వంత్'(Hey Balwanth) బాక్సాఫీస్ వద్ద నిలబడుతుంది అనే హోప్స్ ఇచ్చింది. ‘హే భగవాన్’ అనే ఈ సినిమా టైటిల్ సెన్సార్ కమిటీ వల్ల ‘హే బల్ వంత్’ అయ్యింది. టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. మొదటి రోజు ఈ సినిమాకి పర్వాలేదు అనే రేంజ్లో టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ కూడా పర్వాలేదు అనిపించాయి.మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించే రేంజ్లో ఓపెనింగ్స్ వచ్చాయి. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.75 cr
సీడెడ్ 0.25 cr
ఆంధ్ర(టోటల్) 0.45 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 1.45 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.22 cr
ఓవర్సీస్ 0.32 cr
వరల్డ్ వైడ్(టోటల్) 1.99 cr

‘హే బల్ వంత్’ సినిమాకి రూ.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.4.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 3 రోజుల్లో ఈ సినిమా రూ.1.99 కోట్ల షేర్ నమోదైంది. గ్రాస్ పరంగా రూ.3.45 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.2.51 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus