తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

టాలీవుడ్లో హీరోయిన్ల కొరత ఉంది. సో కొత్త భామలకి మంచి స్కోప్ ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ స్పేస్ ని ఇప్పుడున్న హీరోయిన్లు వాడుకోలేకపోతున్నారు. ఒకటి, రెండు హిట్లు పడిన వెంటనే పారితోషికాలు పెంచేయాలని కూర్చుంటున్నారు. ఇది వారికి ఒక రకంగా ప్లస్ అవ్వొచ్చు. మరో రకంగా మైనస్ అవ్వొచ్చు. నిర్మాతలు కనుక వారు చెప్పిన లెక్కకి తల ఊపితే అది ప్లస్ అవ్వచ్చు.

Kayadu Lohar

మరోవైపు పారితోషికం ఎక్కువై మిగతా నిర్మాతలకి అందుబాటులో లేకపోతే మంచి సినిమాలు మిస్ అవుతాయి. అప్పుడు అది మైనస్ అవ్వచ్చు.సరే ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. ప్రస్తుతం యూత్ లో మంచి క్రేజ్ ఉన్న బ్యూటీ అంటే కయాదు లోహర్(Kayadu Lohar) అనే చెప్పాలి. ఈమె లుక్స్ కి ఆడియన్స్ బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ఈమె ఇచ్చే క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ వంటివి కుర్రకారుని మైమరపిస్తున్నాయి.

అందుకే ఈ అమ్మడి డిమాండ్ అప్పుడే కోటికి వెళ్లిపోయిందట. ప్రస్తుతం ఆమె నాని ‘పారడైజ్’ లో నటిస్తుంది. అలాగే మరో 2 మిడ్ రేంజ్ సినిమాలకి కూడా సైన్ చేసింది.ఇటీవల సైన్ చేసిన ఆ 2 సినిమాలకి ఆమె అక్షరాలా కోటి రూపాయల చొప్పున పారితోషికం వసూల్ చేస్తుందట. వాస్తవానికి కయాదు తెలుగులో చేసినవి రెండే రెండు సినిమాలు. ఒకటి శ్రీవిష్ణుతో చేసిన ‘అల్లూరి’. అది పెద్ద ఫ్లాప్.

ఇంకోటి విశ్వక్ సేన్ తో చేసిన ‘ఫంకీ’ ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా కూడా పెద్ద డిజాస్టర్. అయితే తమిళంలో చేసిన ‘డ్రాగన్’ పెద్ద హిట్ అయ్యింది. ఆ సినిమాలో ఈమె లుక్స్ కి ఆడియన్స్ ఫిధా అయిపోయారు.’డ్రాగన్’ క్రేజ్ తోనే కయాదుకి అవకాశాలు వస్తున్నాయి అని అర్దం చేసుకోవచ్చు. కానీ తెలుగులో ఒక్క హిట్టు కూడా లేకుండా కోటి రేంజ్లో వసూల్ చేయడం అంటే కొంత రిస్క్ అనే చెప్పాలి. ఒకవేళ హిట్లు పడితే.. ఎలాంటి ఇబ్బంది ఉండదు.

‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus