నేచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ‘హాయ్ నాన్న’. శౌర్యువ్ అనే యువ దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ‘వైరా ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించారు. శృతి హాసన్ కూడా స్పెషల్ కేమియో చేసిన ఈ మూవీ డిసెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.
హేషమ్ అబ్దుల్ వాహాబ్ సంగీతంలో రూపొందిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోశాయి అని చెప్పొచ్చు. కానీ మొదటి రోజు పర్వాలేదు అనిపించే రేంజ్లో మాత్రమే కలెక్షన్స్ నమోదయ్యాయి. అయితే రెండో రోజు నుండి పికప్ అయ్యింది అనే చెప్పాలి. రెండో వారంలో కూడా ఈ మూవీ సత్తా చాటుతుంది అని చెప్పాలి. ఒకసారి 12 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 10.05 cr |
సీడెడ్ | 2.31 cr |
ఉత్తరాంధ్ర | 2.28 cr |
ఈస్ట్ | 1.24 cr |
వెస్ట్ | 0.75 cr |
గుంటూరు | 1.08 cr |
కృష్ణా | 1.10 cr |
నెల్లూరు | 0.52 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 19.78 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 3.68 cr |
ఓవర్సీస్ | 8.17 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 31.63 cr (షేర్) |
‘హాయ్ నాన్న’ (Hi Nanna) చిత్రానికి రూ.30.65 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కి ఈ చిత్రం రూ.31 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఇక 12 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.31.63 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా ఈ మూవీ రూ.0.63 కోట్ల లాభాలను అందించింది. మొత్తంగా ఈ మూవీ స్టడీగా క్లీన్ హిట్ స్టేటస్ ను అందుకోవడం విశేషంగా చెప్పుకోవాలి.
మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్
‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!