24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు సినిమా టీజర్స్

  • August 17, 2017 / 06:03 AM IST

గతంలో సినిమా విడుదలైన తర్వాతే రికార్డ్స్ గురించి మాట్లాడుకునే వారు.. ఈ డిజిటల్ యుగంలో టీజర్, ట్రైలర్, ఆడియో వ్యూస్ తో ముందుగానే రికార్డ్స్ నమోదు చేస్తున్నాయి. ఈ రికార్డ్స్ కూడా ఏడాది కా ఏడాది మారిపోతుంటుంది. ఈ సంవత్సరం సగభాగం పూర్తి అయింది. ఈ కాలంలో కొన్ని సినిమాల టీజర్లు సంచలనం సృష్టించాయి. అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ జై టీజర్ ఒక్క రోజులో 4.98 మిలియన్ వ్యూస్ సాధించి నంబర్ వన్ స్థానంలో నిలిచింది.

24 గంటల్లో 4.04 మిలియన్ వ్యూస్ తో రెండో స్థానాన్ని మహేష్ స్పైడర్ కైవశం చేసుకుంది. 2.97 మిలియన్ వ్యూస్ తో కాటమరాయుడు మూడవ ప్లేస్ కి పరిమితమయింది. ఇక తర్వాత వరుసగా రాజా ది గ్రేట్ ( 2.36 మిలియన్ ), దువ్వాడ జగన్నాథం (2.32 మిలియన్), సాహో (2.29 ) నిలిచాయి. ఈ చిత్రాల రికార్డ్స్ స్థానాలు కొత్త సినిమాల టీజర్స్ రాగానే మారిపోతుంటుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus