‘ఉస్తాద్ భగత్ సినిమా’ టీమ్ నుండి కానీ.. ఆ సినిమాను నార్త్ అమెరికాలో రిలీజ్ చేస్తూ హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్న ప్రత్యంగిరా సినిమాస్ టీమ్ నుండి ఓ పోస్టర్ వచ్చింది. ఇప్పటివరకు సినిమా టీమ్ నుండి వచ్చిన పోస్టర్‌లు, వీడియోలు లాంటి ప్రమోషన్స్ స్టఫ్ నుండి పూర్తి దూరంగా.. కాస్త సరదా టైప్‌లో ఆ పోస్టర్‌ను సిద్ధం చేశారు. దీంతో ఆ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫొటో చూస్తే మీరు కూడా సరదా పడతారు.
పవన్ కల్యాణ్ హీరోగా శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా హరీష్ శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మార్చి 26న విడుదల కాబోతున్న ఈ సినిమాను ఓవర్సీలో ప్రత్యంగిరా రిలీజ్ చేస్తోంది. ఈ మేరకు ఆ టీమ్ తన సోషల్ మీడియాలో హ్యాండిల్‌లో ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. అందులో పవన్ కాస్త చిల్ వైబ్‌లో ఉన్నారు. చేతిలో గన్, కళ్లకు ఆకుపచ్చని గ్లాసెస్, పక్కన శ్రీలీలతో వేరే లెవల్ సరదాలో ఉన్నాడు.
స్టార్ హీరోలు ఎవరైనా ఇలాంటి ఫంకీ లుక్ చేయడానికి ఇబ్బందిపడుతున్న రోజులివి. ఎక్కడ ట్రోల్ అవుతామేమో అని భయపడుతూ ఇలాంటి సరదాలు చేయడం లేదు. అందులో వైఎస్‌ఆర్‌సీపీ ట్రోలర్లు ఎప్పుడు ఎలాంటి అవకాశం వస్తుందా? ట్రోల్ చేద్దామా అని పవన్ చుట్టూ తిరుగుతున్నారు. ఈ సమయంలో ఇలాంటి ఫంకీ లుక్‌లో పవన్‌ని చూపించడానికి, ఆ మేరకు ఒప్పించడానికి ధైర్యం కావాలి. ఆ పనిని హరీశ్ శంకర్ చేసి చూపించారు.
ఈ సినిమాను తొలుత తమిళ చిత్రం ‘తెరి’కి రీమేక్ అని చెప్పినా.. ఆ తర్వాత కథను మార్చేశాం, దానికి దీనికీ ఏమీ సంబంధం లేదు అని చెప్పారు హరీశ్ శంకర్. మరి ఈ సినిమా కథేంటి, ఫలితమేంటి అనేది చూడాలి. అన్నట్లు ఈ సినిమా వైబ్ ‘ఓజీ’ సినిమా కంటే ఎక్కువగా ఉంటుంది అని ఆ మధ్య మైత్రీ టీమ్ చెప్పింది.