కేవలం ఒక్క భాషలోనే రిలీజై రూ.1400 కోట్లకుపైగా వసూళ్లు సాధించి బాలీవుడ్ కోర్ స్ట్రెంథ్ ఏంటి అనేది నిరూపించింది ‘ధురంధర్’ సినిమా. గతేడాది విడుదలైన ఈ సినిమాను తెలుగులోనూ డబ్బింగ్ చేసి విడుదల చేస్తారు అంటూ కొన్ని నెలలు గడిచిపోయినా రిలీజ్ చేయలేదు. ఇక థియేటర్లలో ఈ సినిమాను తెలుగులో చూడలేం అని ఫిక్స్ అయిపోయి.. ఓటీటీలోకి వస్తే చూసుకొని ఎంజాయ్ చేశారు. అయితే రెండో పార్ట్ విషయంలో టీమ్ కచ్చితంగా ఈసారి డబుల్ వసూళ్లు అందుకోవాలని ఫిక్స్ అయింది.
అందుకే ఏకంగా ఐదు భాషల్లో సినిమాను సిద్ధం చేస్తోంది. ‘ధురంధర్2: ది రివెంజ్’ పేరుతో రూపొందిన ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఈ క్రమంలోనే సినిమాను హిందీతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ రిలీజ్ చేస్తామని ప్రకటించింది. ‘ది రివెంజ్’కు కౌంట్ డౌన్ మొదలైంది’ అంటూ సినిమా గురించి హైప్‌ని పెంచే ప్రయత్నం చేసింది. మరోవైపు ఈ సినిమా రన్ టైమ్‌పై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఈ సినిమా నిడివి 3 గంటల 40 నిమిషాలకు లాక్ చేశారట.
‘ధురంధర్ 1’ సినిమా 3 గంటల 34 నిమిషాలు ఉన్న విషయం తెలిసింఏద. ఆ లెక్కన రెండో పార్టు నిడివి కాస్త ఎక్కువే. ఇంటర్వెల్‌తో కలుపుకొంటే నాలుగు గంటలుపాటు థియేటర్‌లో ప్రేక్షకుడు ఉండాల్సి ఉంటుంది. సినిమాలో బలమైన కంటెంట్ ఉంటే ఇది పెద్ద విషయం కాదు. తొలి భాగం అదే చేసి చూపించింది. ఇప్పుడు కూడా అలాంటి కంటెంట్ ఉంటం వల్లే దర్శకుడు ఆదిత్య ధర్ నాలుగు గంటలైనా ఓకే.. ప్రేక్షకుణ్ని థియేటర్లలో కూర్చోబెడతా అని అంటున్నారు.
అయితే నాలుగు గంటల రన్‌టైమ్‌తోనే సినిమా ఫైనల్ కట్‌ను సిద్ధం చేశారట. ఆ తర్వాత కొన్ని మార్పులతో 3.40 గంటలకు ఎడిట్ చేసి సెన్సార్ టీమ్‌కి పంపారట. సెన్సార్ టీమ్ ఏమైనా కట్స్ చెబితే.. అప్పుడు నిడివి ఇంకాస్త తగ్గే అవకాశం ఉంది. ఆ విషయంలో మార్చి 19న తెలుస్తుంది. ఆ రోజే ‘ధురంధరుడు’ ఆఖరి సారిగా థియేటర్లలో వస్తాడు. టీమ్ మరో షాకిచ్చి మూడో పార్ట్ అనపోతేనే.