ప్రభాస్ ఫుడ్ గురించి, ప్రభాస్ ఫుడ్ పెట్టే విధానం గురించి, ప్రభాస్ ఫుడ్ ఓవర్ ఎఫెక్షన్ గురించి మొన్నీమధ్య వరకు టాలీవుడ్‌లో, ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా మాట్లాడుకుంటున్నారు. తనతో సినిమా చేసే హీరోయిన్లు, ముఖ్య నటులకు మంచి ఫుడ్ వండించి, వడ్డించడం అంటే డార్లింగ్‌కి ఆసక్తి. గత కొన్నేళ్లుగా ప్రభాస్ ఇలా చేస్తున్నాడు కూడా. ఇటీవల ఓ సినిమా ప్రచారంలో భాగంగా బయటకు వచ్చిన ప్రభాస్ మాట్లాడుతూ చెన్నై నుండి ముంబయికి స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టాను అని చెప్పుకొచ్చాడు.
ఆ మాటలు విన్న ప్రభాస్ ఫ్యాన్స్ ‘మా రాజు గారు గోల్డెహె’ అంటూ మురిసిపోతున్నారు. ‘ఆదిపురుష్’ సినిమా ముంబయి షూటింగ్ సమయంలో ఓ రోజు టీమ్ అంతా మాట్లాడుకుంటుండగా ఫుడ్ గురించి చర్చ వచ్చిందట. మీకు మంచి చెన్నై ఫుడ్ తినిపిస్తా అని టీమ్‌తో ప్రభాస్ చెప్పాడట. ఎవరూ ఏమీ తినొద్దు అని కూడా చెప్పారట. చాలా సేపటికి ఓ వ్యక్తి పెద్ద హాట్ క్యారేజ్ పట్టుకుని వచ్చి ‘మీరు మామూలు వ్యక్తి కాదు సర్.. స్విగ్గీలో చెన్నై నుండి ఆర్డర్ తెప్పించారు’ అన్నాడట. దాంతో అందరూ షాక్ అయ్యారట.
ఈ విషయం ఆయన నోటి నుండే బయటకు రావడంతో ‘స్విగ్గీలో ఇది సాధ్యమవుతుందా? అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే హైదరాబాద్‌లో ఒక ప్రాంతంలో ఫుడ్.. నగరం మొత్తం అందుబాటులో ఉండదు. మరి చెన్నై నుండి ముంబయి ఎలా సాధ్యం అనేది ప్రశ్న. తొలుత ప్రభాస్ సరదాగా అన్నాడు అనుకున్నారంతా. కానీ ఆ ఆప్షన్ ఉంది. అందరికీ అని చెప్పలేం కానీ.. కొన్ని ఎంపిక చేసిన నగరాల మధ్య స్విగ్గీ – ఇండిగో కలసి ఈ ఏర్పాటు చేస్తున్నాయట.
స్విగ్గీ ఇంటర్‌సిటీ ఆప్షన్ ద్వారా ఇది సాధ్యమట. ప్రభాస్ అలా ఏమైనా తెప్పించి ఉండొచ్చు. అయితే పూర్తి వివరాలు ఆ వీడియోలో చెప్పకపోవడం వల్ల అలా మిస్ అండర్‌స్టాండింగ్ చేసుకుంటున్నారు అభిమానులు. మీరూ ట్రై చేస్తారా? ఒకసారి చూడండి మరి.