Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

శ్రీవిష్ణు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అందులో ఒకటి ‘విష్ణు విన్యాసం’.యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 28న విడుదల కానుంది. ఈ మధ్యనే టీజర్ వదిలారు అది పెద్ద ఆకట్టుకునే విధంగా అయితే లేదు కానీ శ్రీవిష్ణు క్యారెక్టరైజేషన్ మెప్పించేలా అనిపిస్తుంది.నయన్ సారిక ఇందులో హీరోయిన్ గా నటించింది. గతంలో ఆమె నటించిన ‘ఆయ్’ ‘క’ సినిమాలు హిట్ అయ్యాయి. రధన్ సంగీతం అందించాడు.

Vishnu Vinyasam

‘విష్ణు విన్యాసం’ చిత్రాన్ని ‘శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్’ సంస్థపై సుమంత్ నాయుడు జి నిర్మించారు. గతంలో ఈయన నిర్మించిన ‘అల్లుడు అదుర్స్’ ‘హరోం హర’ సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. నాన్ ధియెట్రీకల్ పరంగా కూడా ఆయనకి ఎటువంటి లాభాలు తెచ్చిపెట్టలేదు. అయితే ‘విష్ణు విన్యాసం’ అతనికి కొంత రిలీఫ్ ఇచ్చింది అనే చెప్పాలి. శ్రీవిష్ణు ప్రస్తుతం ఫాంలో ఉన్నాడు. ‘సామజవరగమన’ ‘ఓం భీమ్ బుష్’ ‘సింగిల్’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగానే ఆడాయి.

దీంతో ‘విష్ణు విన్యాసం’ సినిమాకి మంచి బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది.ఈ  సినిమాకి సుమంత్ రూ.19 కోట్లు బడ్జెట్ పెట్టారు. థియేట్రికల్ & నాన్-థియేట్రికల్ రైట్స్ రూపంలో రూ.26 కోట్లు వచ్చాయి. సో మొత్తంగా నిర్మాతకి రూ.7 కోట్లు టేబుల్ ప్రాఫిట్ మిగిలింది అనుకోవాలి. ఇప్పుడున్న పరిస్తితుల్లో పెద్ద సినిమాలకే బిజినెస్ జరగడం లేదు. అలాంటిది శ్రీవిష్ణు వంటి మీడియం రేంజ్ హీరో సినిమా రిలీజ్ కి ముందే నిర్మాతకి లాభాలు మిగల్చడం అంటే చిన్న విషయం కాదు అనే చెప్పాలి.

టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus