‘ఇమ్మెచ్చూర్’.. ఈ మాట గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో చర్చలో ఉంది. ఆ డైలాగ్‌ని ట్రోలింగ్ అంటూ ఓ వర్గం నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చారు. ఇదంతా ఓ సినిమా కోసం చేసిన పని కొంతమంది వాదించారు. ఆ వైరల్ వీడియో ఇమిటేషనే తప్ప.. ట్రోలింగ్ కాదు అని ఆ సినిమా టీమ్ ఎంత చెప్పినా ఎవరూ వినలేదు. ఆ డైలాగ్ అయితే ఆ సినిమాకు బాగా కలిసొచ్చింది. ఇంచుమించు ఆ మాట స్థాయిలోనే మరో మాట గత నెల రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అదే ‘చిరంజీవి తొక్కేస్తాడు’ అనే మాట. ఇండస్ట్రీలో చిరంజీవి చాలామందిని తొక్కేశారు అంటూ.. ఆయనకు సంబంధం లేని విషయాలను ఆపాదిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేస్తున్నారు. వీటికి చిరంజీవి టీమ్ నుండి రియాక్షన్ లేదేంటి అంటూ చిరంజీవి ఫ్యాన్స్ కూడా ఆలోచనలో పడ్డారు. ఇక ఆ ట్రోలింగ్ చేసేవారు కూడా ఇదేంటి చిరంజీవి బృందం నుండి రియాక్షన్ లేదు అని ఆలోచించారు. చిరంజీవి పుట్టిన రోజు సంబరాల వేదికగా ఈ విషయంలో ఫుల్ కౌంటర్లు చూపించాయి.
చిరంజీవి ఎవ్వర్నీ తొక్కేయలేడు.. అందరినీ నిలబెడతాడు అంటూ ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్, నటుడు హైపర్ ఆది తమదైన శైలిలో ప్రసంగంలో మాట్లాడారు. చిరంజీవి గురించి తొక్కేశాడు… తొక్కేశాడు… అంటూ తప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది పోస్ట్‌లు చేస్తున్నారు. ఇండస్ట్రీలో నెం.1 గా కంటిన్యూ కావడం ఎవరి వల్లా కాదు అనుకునే వారి అహాన్ని చిరు తొక్కేశారు. 30 ఏళ్లు కంటిన్యూగా నెం.1గా నిలిచారు అని అన్నారు హైపర్ ఆది.
బాలీవుడ్‌లోనే భారీ కలెక్షన్స్ ఉంటాయి. టాలీవుడ్‌లో ఉండవనుకునే వారి ఊహలను తొక్కేశారు. తెలుగు సినిమాలకు అలాంటి కలెక్షన్స్ రప్పించి చూపించారు. డ్యాన్స్‌పై ఉన్న భ్రమల్ని తొక్కేసి ఇండియన్ సినిమాను ఏలారు. హీరో అంటే డబ్బు సంపాదన, బంగ్లాలు కొనుక్కోవడం, సేవ్ చేసుకోవడమే అనుకునే రాంగ్ మైండ్ సెట్‌ను తొక్కేశారు. సామాజిక సేవలో భాగంగా కొన్ని వేల మందికి చిరు సాయం అందించారు. కొడుకుని తండ్రిని మించిన వాడిగా తయారుచేశారు. ఎవరైతే నెగిటివ్ మైండ్ సెట్‌తో ఉంటారో వాళ్ల అహాన్ని, భ్రమలను తొక్కేశారు అని అన్నారు హైపర్ ఆది.