Taapsee: పరోక్షంగా రష్మికకు చురకలు అంటించిన తాప్సీ!

  • January 31, 2024 / 02:00 PM IST

డైరెక్టర్ సందీప్ రెడ్డి దర్శకత్వంలో రణబీర్ కపూర్ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించినటువంటి తాజా చిత్రం యానిమల్. ఈ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అవ్వడమే కాకుండా మరోవైపు తీవ్ర స్థాయిలో విమర్శలను కూడా ఎదుర్కొంది. ఈ సినిమాలో వైలెన్స్, న్యూడిటీ, ఫౌల్ లాంగ్వేజ్ మోతాదుకు మించి ఉన్నాయి.

వీటన్నింటికీ మించి పురుషాధిక్యతను ప్రోత్సహించేలాగా ఉంది అంటూ పలువురు ఈ సినిమా పట్ల విమర్శలు చేశారు. ఇక తాజాగా ఈ సినిమా పట్ల విమర్శలు చేసినటువంటి వారిలో నటి తాప్సి కూడా ఉన్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె యానిమల్ సినిమా గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాప్సీ మాట్లాడుతూ.. సినిమా నటులకు ఒక పవర్ ఉంటుంది. అదే సమయంలో బాధ్యత కూడా ఉంటుంది. అలా అని యానిమల్ వంటి సినిమాలలో నటించే వారిని నేను అసలు తప్పు పట్టడం లేదని తెలిపారు. ప్రజాస్వామిక దేశంలో మనము పుట్టాము. ఇక్కడ ఎవరికీ నచ్చినది వారు చేసుకునే స్వేచ్ఛ ఉంది కానీ నేను మాత్రం ఇలాంటి సినిమాలలో నటించనని ఈమె తేల్చి చెప్పారు.

ఈ విధంగా తాప్సీ (Taapsee) యానిమల్ లాంటి సినిమాలో నేను నటించను అంటూ కామెంట్ చేయడంతో ఈమె పరోక్షంగా రష్మిక ఇలాంటి సినిమాలో నటించినదని ఆమె పై పరోక్షంగా సెటైర్లు వేసారని స్పష్టంగా అర్థమవుతుంది. ఇకపోతే థియేటర్లలో సుమారు 900 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినటువంటి యానిమల్ సినిమా ప్రస్తుతం డిజిటల్ మీడియాలో ప్రసారమవుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus