ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు (Allu Arjun) గత కొన్నేళ్లుగా కెరీర్ పరంగా లక్ కూడా కలిసొస్తోంది. హీరోగా వరుసగా విజయాలను సొంతం చేసుకుంటున్న బన్నీ సోషల్ మీడియాలో సైతం మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటూ ఫ్యాన్స్ కు దగ్గరవుతున్నారు. బన్నీ సుకుమార్ (Sukumar) కాంబో మూవీ పుష్ప ది రూల్ (Pushpa2) నుంచి తాజాగా టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం బన్నీ ఏ స్థాయిలో కష్టపడుతున్నారో టీజర్ ద్వారా క్లారిటీ వచ్చేసింది.
అయితే పుష్ప2 టీజర్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేసి బన్నీ ఖాతాలో అరుదైన రికార్డ్ లను చేర్చింది. ఈ టీజర్ ఏకంగా 138 గంటల పాటు యూట్యూబ్ లో నంబర్ వన్ స్థానంలో కొనసాగడం గమనార్హం. పుష్ప2 టీజర్ కు యూట్యూబ్ లో ఏకంగా 110 మిలియన్ల వ్యూస్, 1.55 మిలియన్ల లైక్స్ వచ్చాయి. 138 గంటల పాటు యూట్యూబ్ లో టీజర్ ఫస్ట్ ప్లేస్ లో ఉండటం సాధారణమైన విషయం కాదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
ఈ రికార్డ్ బ్రేక్ కావాలంటే కూడా చాలా సమయం పడుతుందని బన్నీ ఫ్యాన్స్ చెబుతున్నారు. టీజర్ తోనే ఈ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేసిన బన్నీ సినిమా కలెక్షన్లతో ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తారో చూడాలి. విజువల్ గా ఈ సినిమా మరో స్థాయిలో ఉండబోతుందని ఎన్ని అంచనాలు పెట్టుకున్నా ఆ అంచనాలను మించి ఈ సినిమా ఉంటుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ఈ ఏడాది ఆగష్టు నెల 15వ తేదీన పుష్ప ది రూల్ సినిమా విడుదల కానుండగా ఈ సినిమాకు పోటీగా మరే మూవీ రిలీజ్ కావడం లేదు. పెద్దగా పోటీ లేకుండా రిలీజ్ కానుండటంతో పుష్ప ది రూల్ ఓ రేంజ్ కలెక్షన్లను సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది. ఈ సినిమాకు ప్రమోషన్స్ కూడా భారీ రేంజ్ లో ఉండనున్నాయని భోగట్టా. పుష్ప ది రూల్ రిలీజ్ కు సరిగ్గా 120 రోజుల సమయం మాత్రమే ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.