Chiranjeevi: వైరల్ అవుతున్న చిరంజీవి సంచలన వ్యాఖ్యలు!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లో సక్సెస్ కావాలని రాజకీయాలలో సంచలనాలు సృష్టించాలని భావించినా చిరంజీవి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. ప్రస్తుతం చిరంజీవి రాజకీయాలకు పూర్తిస్థాయిలో దూరంగా ఉన్నారు. తాజాగా చిరంజీవి మరోసారి రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. నేటి రాజకీయాల్లో నాలాంటివాడు అనర్హుడు అని ఆయన పేర్కొన్నారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా సేవలు చేసిన నేను మరింత సర్వీస్ చేయాలనే ఆలోచనతో పాలిటిక్స్ లోకి వెళ్లానని చిరంజీవి పేర్కొన్నారు.

మనకు ఎంతో ఇచ్చిన ప్రజలకు సేవ చేసే ప్రతి ఒక్కరూ ప్రజా సేవకుడే అని చిరంజీవి వెల్లడించారు. నేను రాజకీయాలలో కాలు వేసి పొరపాటు చేశానని మళ్లీ వెనక్కు వచ్చేశానని ఆయన పేర్కొన్నారు. రాజకీయాలలో ఇంకొంచెం పెద్ద ఎత్తున సేవలు చేయాలని భావించాను కానీ నేటి రాజకీయాలలో నాలాంటి వ్యక్తి అనర్హుడు అనేది నిజమని చిరంజీవి చెప్పుకొచ్చారు. నేను రాజకీయాల్లోకి వెళ్లి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చే సమయంలో అదే స్థాయిలో ఆదరణ ఉంటుందా అనే అనుమానం ఉండేదని ఆయన కామెంట్లు చేశారు.

కానీ పాలిటిక్స్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా అదే ప్రేమ అదే అభిమానం చూపించారని చిరంజీవి పేర్కొన్నారు. ఇప్పటికీ మీ ప్రేమ పొందుతున్నానని ఇకపై బ్రతికినంత కాలం సినిమాల్లో ఉంటానని ఓపిక ఉన్నంత కాలం ఫ్యాన్స్ కోసం సినిమాలు చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు. చిరంజీవి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

భవిష్యత్తులో చిరంజీవి ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసే ఛాన్స్ అయితే లేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర (Vishwambhara)  సినిమాతో బిజీగా ఉన్నారు. సినిమా సినిమాకు చిరంజీవి రేంజ్ పెరుగుతోంది. చిరంజీవి కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతూ ప్రశంసలు అందుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus