Imanvi Remuneration: ప్రభాస్ మూవీ హీరోయిన్ ఇమాన్వీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

  • August 20, 2024 / 07:17 PM IST

ప్రభాస్ (Prabhas)   హను రాఘవపూడి (Hanu Raghavapudi)  కాంబో మూవీలో ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఇమాన్వీ ఇస్మాయిల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను అంతకంతకూ పెంచుకుంటుండగా ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ లో ఆమెకు ఏకంగా 8,63,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రభాస్ సినిమాకు ఇమాన్వీ ఇస్మాయిల్ ఏకంగా కోటి రూపాయలు రెమ్యునరేషన్ గా అందుకుంటున్నారని తెలుస్తోంది. ఒక హీరోయిన్ తొలి సినిమాకే ఇంత మొత్తం రెమ్యునరేషన్ తీసుకోవడం అంటే సాధారణ విషయం కాదు.

Imanvi Remuneration

అయితే టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు తీసుకునే రెమ్యునరేషన్ తో పోల్చి చూస్తే మాత్రం ఈ మొత్తం మరీ ఎక్కువ కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం వల్లే ఆమెకు ఇంత మొత్తం పారితోషికంగా దక్కిందని భోగట్టా. ప్రభాస్ సినిమాలో హీరోయిన్ గా ఇమాన్వీ (Imanvi Remuneration) ఎంపిక కావడంతో ప్రముఖ దర్శకనిర్మాతలు తమ సినిమాల కోసం ఈ బ్యూటీని సంప్రదిస్తున్నారని తెలుస్తోంది.

అయితే స్టార్ హీరోల సినిమాలలో నటిస్తే మాత్రమే ఈ బ్యూటీ కెరీర్ పుంజుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్ ఇమాన్వీ కలిసి నటిస్తున్న సినిమా థియేటర్లలో విడుదలయ్యాక ఈ బ్యూటీ క్రేజ్ మామూలుగా ఉండదని చెప్పవచ్చు. ఇమాన్వీ కథ, పాత్ర బాగుంటే మాత్రమే కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు. సినిమాల విషయంలో ఇమాన్వీ కెరీర్ ప్లానింగ్స్ ఏ విధంగా ఉంటాయో తెలియాల్సి ఉంది.

ఇమాన్వీ టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె రీల్స్, యూట్యూబ్ వీడియోలు చూసిన నెటిజన్లు ఇమాన్వీ ఊహించని స్థాయిలో సక్సెస్ కావడం పక్కా అని కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. ఇమాన్వీ ఇస్మాయిల్ యూట్యూబ్ ద్వారా సంపాదించే మొత్తం నెలకు 2 లక్షల రూపాయలు అని సమాచారం అందుతోంది. ఈ హీరోయిన్ జూనియర్ అనుష్క అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 ఆ స్టార్ హీరో కోసం వంశీ పైడిపల్లి పడిగాపులు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus