టాలీవుడ్లో ఉన్న స్టార్ కొరియోగ్రాఫర్స్ లో జానీ మాస్టర్ (Jani Master) ఒకరు. అందరి ‘హీరోలతో మంచిగా డాన్స్ చేయిస్తాడు.. అందరి హీరోల బాడీ లాంగ్వేజ్..ను బాగా అర్థం చేసుకుంటాడు’ అనే మంచి పేరు కూడా ఇతనికి ఉంది. ముఖ్యంగా ‘అల్లు అర్జున్ (Allu Arjun) పాటలకి ఇతను బెస్ట్ ఇస్తాడని’ .. అభిమానులు సైతం జానీ మాస్టర్ ని పొగిడిన సందర్భాలు ఉన్నాయి. అల్లు అర్జున్ పాటలైన ‘మీ ఇంటికి ముందో గేటు'(జులాయి) (Julayi) , ‘కమ్ టు ది పార్టీ'(సన్ ఆఫ్ సత్యమూర్తి) (S/O Satyamurthy) , ‘సినిమా చూపిస్తా మావ'(రేసు గుర్రం) (Race Gurram) , బుట్ట బొమ్మ(అల వైకుంఠపురములో) (Ala Vaikunthapurramulo) వంటి వాటికి అద్భుతమైన కొరియోగ్రఫీ అందించాడు జానీ మాస్టర్.
అందుకే జానీ మాస్టర్ అంటే అల్లు అర్జున్ కి కూడా ఓ ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఇదిలా ఉండగా.. ఇటీవల ‘తిరుచిత్రంబలం’ (Thiruchitrambalam) లోని ‘మేఘం..’ అనే పాటకి బెస్ట్ కొరియోగ్రఫీ కేటగిరిలో జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డు లభించింది. దీంతో టాలీవుడ్ అంతా అతన్ని ప్రశంసించింది. కానీ అందులో అల్లు అర్జున్ మాత్రం లేకపోవడం అందరినీ అయోమయానికి గురి చేసింది. నేషనల్ అవార్డ్స్ అందుకున్న రిషబ్ శెట్టి (Rishab Shetty) , నిత్యా మీనన్ (Nithya Menen) , చందూ మొండేటి (Chandoo Mondeti) వంటి వారిని అభినందిస్తూ ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టాడు అల్లు అర్జున్.
కానీ అందులో జానీ మాస్టర్ పేరును ప్రస్తావించలేదు.’తనకు అత్యంత సన్నిహితుడైన జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డు వస్తే… బన్నీ విష్ చేయకపోవడం ఏంటి?’ అంటూ అందరూ సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు. ఇదిలా ఉంటే.. జానీ మాస్టర్ జనసేన పార్టీకి ప్రచారం చేశాడు. ఇది అందరికీ తెలిసిన సంగతే..! ఓ దశలో ‘అతనికి పవన్ సీట్ ఇస్తారని’ కూడా అనుకున్నారు. కానీ టీడీపీతో పొత్తు వల్ల అలాంటిది జరగలేదు. అయినప్పటికీ జనసేన జెండానే మోయడానికి ఇష్టపడ్డాడు జానీ. మరోపక్క అల్లు అర్జున్.. జనసేనకి కాకుండా వైసీపీ అభ్యర్ధికి ప్రచారం చేయడం వల్ల విమర్శలపాలయ్యాడు.
ఈ కారణం వల్లే అతను ‘జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డు వచ్చినా విషెస్ చెప్పలేదని’ అంతా అల్లు అర్జున్ ని విమర్శిస్తున్నారు. దీనిపై జానీ మాస్టర్ కూడా స్పందించాడు. ‘అల్లు అర్జున్ ఎందుకు విష్ చేయలేదో నాకు కూడా తెలియదు. బహుశా మర్చిపోయారేమో..! నేనైతే నెగిటివ్ గా తీసుకోను. ‘బుట్ట బొమ్మ’ సాంగ్ కే నేషనల్ అవార్డు వస్తుందని అనుకున్నాను. కానీ రాలేదు. ఇప్పుడైతే ఈ పాటకు వచ్చింది. నా పనినే నేను నమ్ముకున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు జానీ మాస్టర్.