టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ 2017లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అనుష్క ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్గా ఎదిగిన సంగతి తెలిసిందే. మరోవైపు ఎవరి సపోర్ట్ లేకుండా క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చి రన్‌మెషిన్‌గా మారి ప్రస్తుతం టీమ్ ఇండియాకు సారథిగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరూ ఎవరి రంగాల్లో వారు రాణిస్తూ లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్‌గా ఉండే విరుష్కల జంట సంపాదన గురించి సోషల్ మీడియాలో ఓ ఆశక్తికర చర్చ జరుగుతోంది.
ఈ క్రమంలో ప్రస్తుతం ఈ ఇద్దరి సంపాదన దాదాపు 120 కోట్లకు చేరిందని, దేశంలోనే అత్యంత సంపన్న సెలబ్రెటీ జోడిగా నిలిచిందని బిజినెస్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ నడుస్తోంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ ఇద్దరు ఎక్కువగా అడ్వైర్టైజ్మెంట్స్ ద్వారానే ఎక్కువగా సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో 2019 ఫోర్బ్స్ లెక్కల ప్రకారం, కోహ్లి సంపాదన దాదాపు 252.72 కోట్లు అని, ఇక అనుష్క సంపాదన కూడా రూ.28.67 కోట్లు అని ఫోర్బ్స్ పేర్కోంది. అనుష్క మొత్తం నికర ఆదాయం విలువ సుమారు 350 కోట్లకు పైగానే ఉంటుందని, విరాట్ నికర ఆదాయం దాదాపు 900 కోట్లుగా ఉన్నాయని ఫోర్బ్స్ వెల్లడించడం గమనార్హం.
ఇటీవల అనుష్క సినిమాలు తగ్గించడంతో ఆమె సంపాదన కాస్త తగ్గిందని, కోహ్లి మాత్రం రోజురోజుకీ తన ఆదాయాన్ని పెంచుకుంటున్నాడి తెలిపింది. క్రికెట్ పరంగా బీసీసీఐ నుండి ఏదాదికి 7 కోట్లు తీసుకునే కోహ్లి.. ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు టీమ్ తరపున 18 కోట్లు తీసుకుంటున్నాడని టాక్. మరోవైపు అనుష్క సినిమాలు, వెబ్‌సిరీస్‌లు నిర్మిస్తూ కూడా సంపాదిస్తోంది. మొత్తానికి ఒకరు ఎంటర్టైన్మెంట్ క్వీన్‌గా, మరొకరు వరల్డ్ క్లాస్ క్రికెటర్‌గా రాణిస్తూ, రిచెస్ట్ సెలెబ్రిటీ జోడీగా నిలిచిందని వ్యాపార వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇక సూపర్ మ్యాటర్ ఏంటంటే విరుష్కల జంట త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు.
Most Recommended Video
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!