Prabhas: ప్రభాస్ క్లారిటీతో ఆ సినిమా నిర్ణయం మారిందా.. ఇప్పట్లో కష్టమేనా?

  • May 5, 2024 / 08:49 PM IST

స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) సినిమాకు పోటీగా సినిమాను విడుదల చేయాలంటే ఇతర భాషల నిర్మాతలు, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు సైతం టెన్షన్ పడతారనే సంగతి తెలిసిందే. ప్రభాస్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఏ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ కల్కి (Kalki 2898 AD) సినిమా జూన్ నెల 27వ తేదీన థియేటర్లలో విడుదల కానుందనే సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అయితే కల్కి సినిమాకు రెండు వారాల ముందు విడుదల చేసినా తమ సినిమాకు నష్టం తప్పదని ఇండియన్2 (Indian2) సినిమా మేకర్స్ భావిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

కల్కి 2898 ఏడీ సినిమాలో కమల్ (Kamal Haasan) కూడా నటిస్తుండటంతో రెండు వారాల గ్యాప్ లో కమల్ సినిమాలు విడుదలవుతూ ఉండటం వల్ల రెండు సినిమాలకు నష్టమని ఇండియన్2 సినిమాకు మరింత నష్టమని మేకర్స్ భావిస్తున్నారట. ప్రభాస్ దెబ్బకు ఇండియన్2 వెనుకడుగు వేసిందని ఇండియన్2 బయ్యర్లను ప్రభాస్ భయపెట్టారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ప్రభాస్ సినిమా రిలీజ్ అంటే ఇతర సినిమాల నిర్మాతలు సైతం భయపడుతున్నారు. బాహుబలి2 (Baahubali 2) , సలార్ (Salaar) బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో ప్రభంజనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళం, హిందీ భాషల్లో సైతం ప్రభాస్ సినిమాలు అంచనాలను మించి ఆకట్టుకున్నాయి. ప్రభాస్ సినిమాలకు 400 నుంచి 500 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతుండటం గమనార్హం.

కల్కి సినిమా ప్రమోషన్స్ త్వరలో మొదలుకానుండగా ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాలి. కల్కి సినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కల్కి సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ ఒకింత భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని భోగట్టా. కల్కి సినిమాలోని ప్రతి పాత్రను దర్శకుడు స్పెషల్ గా తీర్చిదిద్దారని సమాచారం అందుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus