Aa Okkati Adakku Collections: ‘ఆ ఒక్కటీ అడక్కు’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?

అల్లరి నరేష్ (Allari Naresh) హీరోగా ‘ఆ ఒక్కటీ అడక్కు’ (Aa Okkati Adakku) అనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మల్లి అంకం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘చిలక ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మించారు. ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి .. స్టార్ రైటర్ అబ్బూరి రవి డైలాగ్స్ అందించడం జరిగింది. టీజర్‌, ట్రైలర్‌..బాగానే అనిపించాయి కానీ నిన్న రిలీజ్ అయిన ఈ సినిమాకి మొదటి షోతోనే నెగిటివ్ టాక్ వచ్చింది.

అయినప్పటికీ కలెక్షన్స్ ఓకే అనిపించాయి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.18 cr
సీడెడ్ 0.05 cr
ఉత్తరాంధ్ర  0.06 cr
ఈస్ట్ 0.03 cr
వెస్ట్ 0.02 cr
గుంటూరు 0.03 cr
కృష్ణా 0.04 cr
నెల్లూరు 0.02 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 0.43 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.06 cr
 ఓవర్సీస్ 0.08 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 0.57 cr (షేర్)

‘ఆ ఒక్కటీ అడక్కు’ చిత్రానికి రూ.4.13 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.4 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమా రూ.0.57 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.3.83 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది.

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus