JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పాట ‘జిమ్‌ జిమ్‌ తారా.. జిమ్‌ జిమ్‌ తారా.. జిలేబీ తేరా చిన్నోడా..’. ఒరిజినల్‌ సాంగ్, రీమిక్స్‌ సాంగ్‌లు సోషల్‌ మీడియా ఫీడ్‌లో వస్తూనే ఉన్నాయి. దీంతో ఇందులో ఒరిజినల్‌ వీడియో ఏదీ అనే డిస్కషన్‌ కూడా నడుస్తోంది. కొంతమంది అయితే ఈ పాట త్వరలో సినిమాల్లోకి వచ్చేస్తుంది అంటూ అంచనాలు వేశారు. అయితే ఇప్పుడు వచ్చిన సమాచారం ప్రకారం అయితే.. అది ఆల్‌రెడీ సినిమాలోని పాటే.

JIm Jim Thara

అవును.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న జిలేబీ తేరా చిన్నోడా..’ పాటకు నెటిజన్లు పెద్ద ఎత్తున రీల్స్‌ చేస్తున్నారు. మరికొందరు తమ స్టైల్లో రీమిక్స్‌ చేసి పోస్ట్‌ చేస్తున్నారు. లక్ష్మీదేవి అనే గాయని ఈ పాట ‘పర్ణశాల’ అనే సినిమాలోనిదట. ఆ సినిమా నిర్మాత మంచి వెంకట్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. తమ సినిమాకు పాడిన లక్ష్మీదేవి ఆ పాటను అధికారికంగా విడుదల చేయకముందే బయట పాడారని చెప్పారు.

ఆమె పాడిన పాటకు ఈ స్థాయిలో స్పందన వస్తుందని తాము ఊహించలేదని ఆయన చెప్పారు. త్వరలోనే ఆ పాట లిరికల్‌ వీడియోను విడుదల చేయనున్నట్లు కూడా తెలిపారు. నిజంగా ఇది సినిమాలోని పాటనా.. లేక వైరల్‌ అయ్యాక సినిమాలో పెట్టి ఇలా చెబుతున్నారా అనేది లక్ష్మీదేవి చెబితే కానీ తెలియదు. లిరికల్‌ సాంగ్‌ వస్తుంది అంటున్నారు కాబట్టి అప్పడు ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అయితే లక్ష్మీదేవి పాడుతున్న వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. దానికి రీమిక్స్‌లు కూడా వచ్చేస్తున్నాయి.

ఈ పాట వేడి చల్లారక ముందే ‘పర్ణశాల’ సినిమాను రిలీజ్‌ చేసేయాలి. ఎందుకంటే సోషల్‌ మీడియా వైరల్‌ అనేది ఎక్కువ రోజులు ఉండదు. గతంలో మనం ఇలాంటి పరిస్థితులు చాలానే చూశాం. కాబట్టి ‘జిమ్‌ జిమ్‌ తారా.. సినిమా రిలీజ్‌ చేసేయాలి ప్రొడ్యూసర్‌ గారూ’ అనాల్సి వస్తోంది.

‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus