2000వ సంవత్సరం విక్టరీ వెంకటేష్ కి బాగా కలిసొచ్చింది. ఆ ఏడాది ఆరంభంలో అంటే సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ‘కలిసుందాం రా’ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. తర్వాత అదే ఏడాది ‘జయం మనదేరా’ (Jayam Manadera) సినిమా వచ్చింది. ఎన్ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘సురేష్ ప్రొడక్షన్స్’ సంస్థపై డి.సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. 2000వ సంవత్సరం అక్టోబర్ 7న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. మొదటి నుండీ ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఆ అంచనాలని మ్యాచ్ చేస్తూ ఈ సినిమా మొదటి రోజు సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఫస్ట్ హాఫ్ అంతా కామిడీతో సరదా సరదాగా గడిచిపోయినప్పటికీ.. సెకండాఫ్లో వచ్చే మాస్ ఎలిమెంట్స్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఫలితంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. నేటితో 26 ఏళ్ళు పూర్తిచేసుకుంటున్న ‘జయం మనదేరా’ టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
| నైజాం | 5.4 cr |
| ఆంధ్ర(టోటల్) | 2.1 cr |
| ఏపీ (టోటల్) | 5.8 cr |
| వరల్డ్ వైడ్ టోటల్ | 13.3 cr కోట్లు (గ్రాస్) |
‘జయం మనదేరా’ చిత్రం ఆ రోజుల్లో రూ.13.3 కోట్ల వరకు గ్రాస్ ను కలెక్ట్ చేసింది. 103 సెంటర్స్ లో 50 రోజులు, 34 కేంద్రాల్లో 100 రోజులు ఆడి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ‘జయం మనదేరా’. వందేమాతరం శ్రీనివాస్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి.