Vishwaksen: షూటింగ్‌ స్టార్ట్‌ చేసేసి అప్పుడు రీమేక్‌ రైట్స్‌ కోసం వెళ్లిన విశ్వక్‌

మన దగ్గర రెండు రీమేక్‌లు ఉంటాయి. ఒకటి అచ్చంగా రైట్స్‌ తీసుకొని తీసుకునే రీమేక్‌. రెండోది ఎలాంటి రైట్స్‌ తీసుకోకుండా సినిమాను తెరకెక్కించడం. ఇన్నాళ్లూ ఈ రెండింటి గురించి విని ఉంటారు. అయితే ఇప్పుడు మూడో రకం రీమేక్‌ బయటకు వచ్చింది. అదే ముందు రీమేక్‌ షూటింగ్ స్టార్ట్‌ చేసి.. ఆ తర్వాత రీమేక్‌ రైట్స్‌ తీసుకోవడం. ఈ కొత్త పద్ధతిని కనిపెట్టింది ఎవరో విశ్వక్‌సేన్‌. ఇదంతా జరిగింది ‘ఫలక్‌నుమా దాస్‌’ సినిమా సమయంలో జరిగింది.

Vishwaksen

మనకు ఎన్నో ఏళ్లుగా తెలిసిన విషయం ఏంటంటే.. ఏదైనా సినిమాను రీమేక్ చేయాలంటే ముందు రైట్స్ తీసుకోవాలి. ఆ తర్వాత స్క్రిప్టులో మార్పులు చేర్పులు ఏవైనా అవసరం అనుకుంటే అవి చేసుకుంటారు. కానీ విశ్వక్‌సేన్‌ రీమేక్ రైట్సే తీసుకోకుండా షూటింగ్ మొదలుపెట్టాడు. అదే దర్శకుడిగా చేసిన తొలి చిత్రం ‘ఫలక్‌నుమా దాస్’. హైదరాబాద్‌లో రెండు పండుగలకు సంబంధించిన దృశ్యాలను విశ్వక్‌ తొలుత షూట్‌ చేశాడట. ఎందుకీ సీన్స్‌ అని ఫ్రెండ్‌ అడిగితే.. ‘అంగామలీ డైరీస్’ సినిమాను రీమేక్ చేస్తున్నానని చెప్పాడట.

మరి రైట్స్ తీసుకున్నావా అని అడిగితే ఆ పని మీదే రెండు రోజుల్లో కేరళ వెళ్తున్నట్లు చెప్పాడట. దాంతో ఆ ఫ్రెండ్‌ షాకయ్యాడట. నిజమే మరి సినిమా షూటింగ్‌ మొదలెట్టాక రైట్స్‌ తీసుకోవడం అంటే పెద్ద విషయమే కదా. ‘అంగామలీ డైరీస్’ సినిమా రీమేక్ చేయాలని ఫిక్సయ్యాకే షూటింగ్ మొదలుపెట్టానని విశ్వక్‌ చెప్పాడు. అయితే సినిమా ఒరిజినల్‌లో కొన్ని సీన్లను కుటుంబ సభ్యులకు చూపిస్తే ఇదే సినిమా అన్నట్లు చూశారని విశ్వక్‌ చెప్పాడు.

సినిమాను మ్యూట్‌లో పెట్టి తెలుగు డైలాగులతో కథ నరేట్ చేస్తే వారంతా ఎగ్జైట్ అయ్యారట. ఆ తర్వాత కేరళకు వెళ్లి రైట్స్ తీసుకున్నానని, అందుకోసం రూ.11 లక్షలు ఖర్చయిందన్నాడు. విశ్వక్‌ నమ్మకమే నిలబడింది. ఆ సినిమా అదేనండీ ‘ఫలక్‌నుమా దాస్‌’ అదిరిపోయే విజయం అందుకుంది.

సైలెంట్ గా బ్లాక్ బస్టర్ కొట్టేస్తుందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus