సూర్య-సమంతల 24 మూవీ వెనుక ఆసక్తికర స్టోరీ

  • June 13, 2020 / 09:32 PM IST

2016 లో హీరో సూర్య, డైరెక్టర్ విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రం 24. సైన్స్ ఫిక్షల్ జోనర్ వచ్చిన ఆ చిత్రం మిశ్రమ స్పందన దక్కించుకుంది. ఐతే నటుడిగా హీరో సూర్య అద్భుతం చేశారు. ఆయన తండ్రి కొడుకులు మరియు విలన్ పాత్రలలో కనిపించారు. మూడు భిన్నమైన షేడ్స్ కలిగిన పాత్రలలో వైవిధ్యమైన నటనతో ఆయన ఆకట్టుకున్నారు. ఐతే ఈ చిత్రం హీరో విక్రమ్ కోసం దర్శకుడు రాశారట. విక్రమ్ హీరోగా ఇలియానా హీరోయిన్ గా ఈ చిత్రం షూటింగ్ కూడా మొదలైనదట. ఐతే కారణం ఏదైనా ఆ మూవీ ఆగిపోయింది.

అక్కినేని కుటుంబంలోని మూడు తరాల హీరోలు కలిసి నటించిన మనం చిత్రం చూసిన సూర్య ఆ మూవీని దర్శకుడు విక్రమ్ కుమార్ తో రీమేక్ చేయాలి అనుకున్నారట. ఆ మూవీలో సూర్య, కార్తీ మరియు వాళ్ళ నాన్న శివ కుమార్ నటించాలని అనుకున్నారట. అందుకే విక్రమ్ కుమార్ ని పిలిచి అడుగగా, తన దగ్గర ఉన్న 24మూవీ స్క్రిప్ట్ సూర్యకు చెప్పారట. ఆ స్క్రిప్ట్ సూర్యకు బాగా నచ్చడంతో 24 మూవీ కార్యరూపం దాల్చింది.

ఆ విధంగా విక్రమ్ నటించాల్సిన 24 మూవీ సూర్య నటించాడు. ఇక ఇలియానాకు బదులు సమంత ఆ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా విక్రమ్ కుమార్ సిద్ధం చేస్తున్నారు. 24 చిత్రీకరణ సమయంలోనే సీక్వెల్ చేయాలనీ వీరిద్దరూ భావించారట. ప్రస్తుతం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న విక్రమ్ అది బాగా వస్తే సూర్యతో చేస్తారట.

Most Recommended Video

కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus