KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

ప్రముఖ కథానాయకుడు నాగార్జున వందో సినిమా ప్రస్తుతం సెట్స్‌ మీద ఉన్న విషయం తెలిసిందే. రా.కార్తిక్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమా గ్లింప్స్‌ను ‘#KING 100’ పేరుతో నాగ్‌ పుట్టినరోజు సందర్బంగా విడుదల చేశారు. ‘మనుషుల్లో రెండు రకాలు.. ఒకటి డబ్బున్న వాళ్లు, రెండు డబ్బులేని వాళ్లు’ అంటూ మొదలైన ఈ సినిమా గ్లింప్స్‌.. డబ్బు ఉంటే మనిషిని ఎలా చూస్తారు, లేకపోతే ఎలా చూస్తారు అనే విషయం చెప్పే డైలాగ్‌తో ముగిసింది. ఆఖరులో ఈ సినిమాను డిసెంబర్‌ 24న రిలీజ్‌ చేస్తాం అని చెప్పారు. అయితే మధ్యలో ఇంకొన్ని ఆసక్తికర విషయాలు ఉన్నాయి.

King 100

* గ్లింప్స్‌ ప్రారంభంలోనే పాత వంద రూపాయల నోట్లు చూపించి.. సినిమా ఇప్పటిది కాదు. కాస్త వెనకటి కథ చూపించబోతున్నారు అని చెప్పకనే చెప్పారు.

* ఆ వెంటనే గుర్రపు పందాల చూపించి సినిమాలో జూదం కీలక పాత్ర పోషిస్తుందని క్లియర్‌గా చెప్పేశారు. ఈ లెక్క సుమారు రూ.50 వేల కోట్ల మోసం అని చెప్పొచ్చు.

* ఈ సినిమా రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో జరగబోతోంది. ఇతర ప్రాంతాల నుండి సీమకు వలస వచ్చిన వారికి ఓ రెఫ్యూజీల క్యాంప్‌ను ఏర్పాటు చేయడం ఓ సీన్‌లో చూడొచ్చు.

* వలసదారుడిగా వచ్చిన నాగార్జున (పేరు విశ్వనాథ్‌ కావొచ్చు) వాంటెడ్‌ జాబితాలోకి వచ్చాడు. ఆ పోస్టర్‌లో ఓల్డ్‌ నాగ్‌ లుక్‌ను చూడొచ్చు.

* సినిమాలో గుర్రపు పందేలతోపాటు లాటరీ కూడా కీలకంగా ఉండనుంది. ఓ సీన్‌లో లాటరీ గిఫ్ట్‌గా కారును చూడొచ్చు.

* మరో సీన్‌లో పోలీసు స్టేషన్‌లో నోటీసు బోర్డులో నాగార్జున ఫొటోతోపాటు లాటరీలో రాజకీయ నాయకులు, అధికారుల కుమ్మక్క లాంటి పేపర్‌ క్లిప్పింగ్‌లు కనిపిస్తాయి. కొన్ని లాటరీ టికెట్‌లు కూడా కనిపిస్తాయి.

* నాగార్జున పేరు, పుట్టిన రోజును ఓ కారు నెంబర్‌ ప్లేట్‌ మీద చూడొచ్చు. అదే KING 2908. ఇంకో సీన్‌లో బెంగళూరుకు దారి బోర్డు కనిపిస్తుంది. కాబట్టి సీమ – బెంగళూరు మధ్య జరిగే స్టోరీ కావొచ్చు.

* మరో స్లైడ్‌లో ఓ పేపర్‌ కటింగ్‌ మీద రూ. 50 వేల కోట్ల మోసం అని రాస్తూ.. నాగార్జున ఫొటో వేస్తారు. ఆ పేపర్‌లో ఆగస్టు 5, మంగళవారం అని రాశారు. ఆ లెక్కన ఈ సినిమా కథ 2025, 2014, 2008, 2003, 1997లో జరిగి ఉండాలి. పేపర్‌ కటింగ్‌ బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఉంది కాబట్టి 1997 నాటి కథ అవ్వొచ్చు.

* మరో పేపర్‌ కటింగ్‌లో ఆగస్టు 24, 1993 అని చూపించారు. ఈ డేట్‌, పైన చెప్పిన డేట్‌ సింక్‌ అవ్వడం లేదు. కాబట్టి ఈ క్లిప్పింగ్స్‌ వేర్వేరు సంఘటనలు అయి ఉండాలి. లేదంటే కంటిన్యూషన్‌లో ఎక్కడో తప్పులో కాలేసి ఉండాలి.

* ఇక ఈ సినిమాలో లాటరీని రన్‌ చేసే వ్యక్తి పేరు రుథ్రనాథ్‌. ఆయన కంపెనీ పేరు లక్ష్మీ లాటరీస్‌. ఇందులోనే ఏదో తప్పు జరిగి.. జనాలు ఆయన ఇంటిపై దాడి చేస్తారు.

* మరో సీన్‌లో చూస్తే.. కొత్త పది రూపాయల నాణెం కనిపిస్తోంది. దాని ప్రకారం సినిమా కథ నేటితో మొదలైన వెనక్కి వెళ్లాలి. లేదంటే ఎక్కడో మొదలు పెట్టి నేటి కాలానికి తీసుకురావాలి.

బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus