Vijay Antony: ఆ స్టార్‌ హీరో ఎప్పుడూ చెప్పులు వేసుకోకపోవడానికి కారణమిదే

ప్రముఖ కథానాయకుడు విజయ్‌ ఆంటోనిని బయట చూసేవాళ్లు ఓ ప్రశ్న కచ్చితంగా అడుగుతారు. అదే ‘మీరెందుకు చెప్పులు వేసుకోరు’ అని. ఈ ప్రశ్నకు గత కొన్నేళ్లుగా రకరకాల సమాధానాలు చెబుతూ వచ్చారు ఆయన. అయితే ఆన్సర్లలో నిజం లేదు అని ఇప్పుడు తేలింది. ఆయన ఇన్నాళ్లు ఓ ఎమోషనల్‌ విషయాన్ని దాచారు అని తేలింది. ఆ వివరాలను ఇప్పుడు ఆయన భార్య ఫాతిమా చెప్పుకొచ్చారు.

Vijay Antony

మారన్‌ దర్శకత్వంలో విజయ్‌ ఆంటోని, ప్రీతి అస్రానీ, బేబీ లితన్యా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అప్పా కుట్టి’. తెలుగులో ‘నాన్న కుట్టి’ అనే పేరుతో ఆ సినిమాను రిలీజ్‌ చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీ థియేటర్లలోకి రానున్న సందర్భంగా చెన్నైలో ప్రీరిలీజ్‌ వేడుక, ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫాతిమా విజయ్‌ మాట్లాడుతూ విజయ్‌ ఆంటోని చెప్పులు వేసుకోకపోవడం వెనుక కథను చెప్పారు.

తమ కుమార్తె మీరా ఉపయోగించిన వస్తువులు ఆమె గదిలో ఇప్పటికీ జ్ఞాపకాలుగా కాపాడుకుంటున్నామని ఫాతిమా చెప్పారు. మీరా కోసం కొనుగోలు చేసిన చెప్పులను చూసి ఇకపై జీవితంలో చెప్పులు వేసుకోకూడనదని విజయ్‌ ఆంటోని అనుకున్నారని చెప్పారు. మీరా కొని ఇచ్చిన రూ.4వేల విలువైన చేతి గడియారాన్ని మాత్రమే ధరిస్తున్నారని, దాని కోసం గతంలో వాడిన ఖరీదైన చేతి గడియారాన్ని పక్కనపెట్టేశారని ఫాతిమా తెలిపారు.

గతంలో చెప్పుల ప్రస్తావన వచ్చినప్పుడు విజయ్‌ ఆంటోని మాట్లాడుతూ.. ఇలా చెప్పులు వేసుకోకుండా ఉంటే బాగుందని, అందుకే ఇది కంటిన్యూ చేస్తున్నానని చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే అసలు కారణం కుమార్తె మరణం తర్వాత తీసుకున్న కీలక నిర్ణయం అని అర్థమవుతోంది. కూతురు మీద అభిమానం, ప్రేమ ఎంతగా ఉందో ఈ ఒక్క పని ద్వారా కూడా తెలుస్తుంది. ఇదీ విజయ్‌ ఆంటోని అంటే.

మరో సినిమా ఓకే చేసిన సాయితేజ్‌.. ఎన్ని సినిమాలు లైన్‌లో పెట్టుకుంటాడు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus