సాయి ధరమ్ తేజ్ నుండి సినిమా వచ్చి మూడేళ్లు అవుతోంది. వచ్చే జూన్‌లో ఆయన సినిమా వస్తే నాలుగేళ్లకు ఆయన నుండి సినిమా రాబోతోంది. అదే ‘సంబరాల యేటిగట్టు’. గత కొన్నేళ్లుగా షూటింగ్‌లో ఉన్న ఈ సినిమా సంక్రాంతికి అన్నారు కానీ.. ఆ తర్వాతే రావొచ్చు అని చెబుతున్నారు. ఇన్నాళ్ల గ్యాప్‌ను కవర్ చేయడానికి సాయితేజ్ ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాడు అనిపిస్తోంది. అందుకే వరుస సినిమాలు చేయడానికి ప్లాన్ రెడీ చేసుకున్నారు. ఈ క్రమంలో కొత్త కథను ఓకే చేశాడు అని చెబుతున్నారు.
అదే ‘గూఢచారి’, ‘మేజర్’ సినిమాల దర్శకుడు శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో ఉండనున్న ప్రాజెక్ట్. ఆ సినిమా కోసం ఏకంగా సాయితేజ్ నిర్మాత అవ్వాలని ఫిక్స్ అయ్యాడట. ఈ సినిమా శశికిరణ్ స్టయిల్లోనే ఇదీ థ్రిల్లర్ జోనర్‌లోనే ఉంటుంది అని సమాచారం. ఇక పైన చెప్పినట్లు ‘సంబరాల యేటిగట్టు’ తర్వాత తేజు స్పీడు పెంచే పనిలో ఉన్నాడు. ‘సేవ్ ద టైగర్స్’ వెబ్ సిరీసులతో దర్శకుడిగా మారిన నటుడు తేజ కాకుమాను దర్శకత్వంలో తేజు ఒక సినిమాను కొన్ని రోజుల క్రితం అనౌన్స్ చేశాడు.
ఆ సినిమా తర్వాత ‘క’ సినిమా దర్శక ద్వయం సుజీత్ – సందీప్‌లతో ఒక సినిమా చేయాల్సి ఉంది. నిర్మాత వివేక్ కూచిభొట్ల ప్రొడక్షన్‌లో కూడా ఓ సినిమా చేస్తారని ఆ మధ్య వార్తలొచ్చాయి. అలా వరుస కథను దగ్గర పెట్టుకుని బరిలోకి దిగాలని సాయితేజ్ ప్లాన్‌లో ఉన్నాడు. ఇవన్నీ తేలాలి అంటే ఇప్పుడు చేతిలో చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న ‘సంబరాల యేటి గట్టు’ పనులు పూర్తవ్వాలి. ఎందుకో కానీ ఆ సినిమా వాయిదా పడుతూనే ఉంది.
ఇక ఇటీవల సాయితేజ్ వివాహం కూడా కుదింది. తన చిన్ననాటి మిత్రురాలు కిరణ్మయితో ఆయన నిశ్చితార్థం నవంబర్ 5న జరిగింది. హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో జరిగిన వేడుకకు ఇరు కుటుంబాల పెద్దలు, బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. వీరి వివాహం డిసెంబర్ 10, 2026న హైదరాబాద్‌లో జరగనుంది.