RRR Movie: ఆ అనుమానాలకు చెక్ పెట్టిన జక్కన్న!

  • July 16, 2021 / 07:10 PM IST

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో దానయ్య నిర్మాతగా చరణ్, తారక్ కాంబోలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ మేకింగ్ వీడియో రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ఈ సినిమా గురించి ప్రేక్షకుల్లో నెలకొన్న అనుమానాలు అన్నీ మేకింగ్ వీడియోతో పటాపంచలు అయ్యాయి. కొన్నిరోజుల క్రితం విజయేంద్ర ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అలియా భట్ పాత్ర సినిమాకు హైలెట్ కానుందని చెప్పగా తాజాగా రిలీజైన మేకింగ్ వీడియోను పరిశీలిస్తే అజయ్ దేవగణ్ పాత్ర సినిమాకు స్పెషల్ గా ఉండబోతుందని ఈ పాత్ర కూడా సినిమాకు హైలెట్ కానుందని అర్థమవుతోంది.

ఆర్ఆర్ఆర్ టీమ్ అజయ్ దేవగణ్ పాత్ర గురించి ఎక్కువగా చెప్పలేదు. మేకింగ్ వీడియోలో సైతం అజయ్ ఆఖరులో కనిపించినా రాజమౌళి ఆయన పాత్రను సమ్ థింగ్ స్పెషల్ గా ఉండబోతుందని ఫీల్ ఇచ్చారు. మరోవైపు బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ సీత పాత్రకు సరిపోతుందా అని వ్యక్తమైన అనుమానాలను సైతం మేకింగ్ వీడియోలోని ఒక్క ఫ్రేమ్ తో జక్కన్న చెక్ పెట్టారు. ఎన్టీఆర్ కు జోడీగా నటిస్తున్న ఒలీవియా మోరిస్ కనిపించింది కొన్ని సెకన్లే అయినా ఆమె స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది.

సినిమాలో పిల్లల పాత్రలకు కూడా ప్రాధాన్యతనిచ్చే జక్కన్న ఈ మూవీలో కూడా పిల్లలకు ప్రాధాన్యతనిచ్చారని అర్థమవుతోంది. మేకింగ్ వీడియోలో చరణ్, ఎన్టీఆర్ కొన్ని సెకన్ల పాటే కనిపించినా తమ లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టున్నారు. అంతర్జాతీయ స్థాయిలో రిలీజయ్యే సినిమా కావడంతో ఆర్ఆర్ఆర్ కు ప్రేక్షకుల్లో ఉద్వేగం కలిగేలా కీరవాణి నేపథ్య సంగీతం ఇవ్వడం గమనార్హం.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus