Shraddha Kapoor: ఛాన్స్‌లు ఇవ్వండి అంటూ ఇక్కడ రిక్వెస్ట్‌ చేస్తే… హాలీవుడ్‌లో వచ్చింది!

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్‌ గురించి కొన్ని రోజుల క్రితం ఓ వార్త వచ్చింది. ‘యానిమల్‌’ సినిమా వచ్చినప్పుడు ఆ డిస్కషన్‌ కనిపించింది. అదే సరైన అవకాశం కోసం ఆయన ఎంతగా ఎదురుచూశారు, ఎంత మథన పడ్డారు అనేది. ఆయన ప్రయత్నాలు ఫలించాక, అంతకుముందు ఆయన ఇంట్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అనేది కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆయన కెరీర్‌ ఫుల్‌ స్పీడ్‌లో దూసుకుపోతోంది.

Shraddha Kapoor

అలాంటి మరో కథ ఇప్పుడు బాలీవుడ్‌లో బయటకు వచ్చింది. తనకు అవకాశాలు కల్పించాలంటూ బాలీవుడ్ నటుడు శరద్ కపూర్ (Shraddha Kapoor) వేడుకుంటున్న వీడియో ఒకటి ఇటీవల వైరల్‌ అయింది. అంత మంచి నటుడికి అవకాశాలు రాకపోవడం ఏంటి అని అనుకున్నారు ఆ వీడియోలు చూసినవారు. అయితే, ఇప్పుడు ఆయనకు హాలీవుడ్‌ నుండి అవకాశం వచ్చింది. జనవరిలో ఆ ప్రాజెక్టు పనులు మొదలవుతాయని శరద్‌ చెప్పారు.

దాంతోపాటు ఆ వీడియో విషయంలోనూ శరద్‌ మాట్లాడారు. తను మాటల ఉద్దేశం ఇండస్ట్రీని విమర్శించడం కాదని, తనకు ఎలాంటి ఆర్థిక సాయం అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. నేను ఏడేళ్లుగా న్యూయార్క్‌లో ఉంటున్నాను. ఏడాది క్రితమే ఇండియాకు తిరిగొచ్చాను. నా తోటి నటులను విమర్శించాలన్నది వీడియో ఉద్దేశం కాదు. సినీ పరిశ్రమలోని వాళ్లంతా నా కుటుంబం లాంటి వాళ్లే. కేవలం డబ్బు కోసమే నేనెప్పుడూ సినిమాలకు ఓకే చెప్పలేదు అని చెప్పారు.

ఇండస్ట్రీలో ఒకరినొకరు విమర్శించుకుంటే ప్రజల దృష్టిలో చులకనవుతాం. త్వరలో బాలీవుడ్‌లోనూ వరుసగా నటిస్తాను. ఇంకో రెండు నెలల్లో నా ఆరోగ్యం పూర్తిగా కుదుటపడుతుంది. ఆ తర్వాత అంతా సర్దుకుంటుంది అని శరద్‌ చెప్పారు. అలాగే గతంలో తనపై వచ్చిన ఆరోపణల గురించి కూడా శరద్ భావోద్వేగానికి లోనయ్యారు. 2024లో ఓ నటి తనపై లైంగిక వేధింపుల కేసు పెట్టడంతో మనోవేదనకు గురైనట్లు చెప్పారు.

చేయని తప్పునకు నిందలు పడితే ఆ బాధ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఆ తప్పుడు ఆరోపణలతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. ఎవరినీ కలవాలనిపించలేదు. పని చేయాలన్న ఉత్సాహం కూడా చచ్చిపోయింది అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎట్టకేలకు కొత్త బాండ్‌ వచ్చేశాడు.. ఎవరో తెలుసా?

 

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus