Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

అమెరికా, ఇరాన్‌ మధ్య గత కొన్నేళ్లుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇన్నాళ్లూ బాంబులు, జెట్‌లు, డ్రోన్లతో యుద్ధాలు చేసుకున్న ఆ రెండు దేశాలు ఇప్పుడు తెలుగు సినిమా క్లిప్పింగ్‌లతో యుద్ధం చేసుకునే పరిస్థితి నెలకొంది. దీనికి కారణం అమెరికాను హెచ్చరించేందుకు ఇరాన్‌ తెలుగు సినిమా క్లిప్‌లను వాడుకుంటోంది. ఇప్పటికే ‘భగవంత్‌ కేసరి’ వీడియోతో ఓ వార్నింగ్‌ ఇచ్చిన ఇరాన్‌.. ఇప్పుడు ‘బాహుబలి’ సినిమా క్లిప్‌ను వాడుకుంది.

Tollywood

జింబాబ్వేలోని ఇరాన్‌ రాయబార కార్యాలయం ఇటీవల ‘భగవంత్‌ కేసరి’ సినిమాలోని ఓ ఫైట్‌ వీడియోను పోస్టు చేసింది. విలన్లను బాలకష్ణ మట్టకరిపిస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్‌లోని ఇరాన్‌ రాయబార కార్యాలయం ప్రభాస్‌ – రాజమౌళి సూపర్‌హిట్‌ చిత్రం ‘బాహుబలి’ సినిమా యాక్షన్‌ సీన్స్‌ వీడియో క్లిప్‌ను పోస్ట్‌ చేసింది. కాలకేయులతో బాహుబలి యుద్ధం చేస్తున్న దృశ్యాలు అందులో ఉన్నాయి.

మేం ఎవరికీ తలవంచబోమని మా అధ్యక్షుడు పెజెష్కియాన్‌ ఐరాస సమావేశంలో చెప్పారు. కాలకేయులకు ఎదురొడ్డి బాహుబలి పోరాడినట్లే, మేం కూడా మా మాతృ దేశం కోసం రక్తం చిందించి ప్రాణత్యాగానికైనా సిద్ధపడతాం అని ఇరాన్‌ ఎంబసీ ఆ పోస్టులో రాసుకొచ్చింది. దీంతో టాలీవుడ్‌ సినిమాలు అమెరికా – ఇరాన్‌ మధ్య యుద్ధానికి ఉపయోగపడుతున్నాయి.

జింబాబ్వేలోని ఇరాన్‌ రాయబార కార్యాలయం అయితే.. ఇరాన్‌ను నాశనం చేయడం గురించి ట్రంప్‌ మాట్లాడుతున్నారు. కానీ ఇరాన్ తనను తాను రక్షించుకోలేని దేశం కాదని ఆయనకూ తెలుసు. ఈ విషయం తెలియజేసినప్పటి నుండి వారు హాలీవుడ్‌కు బదులుగా భారతీయ సినిమాలు చూస్తున్నారు అని ఇరాన్‌ ఎంబసీ ఎద్దేవా చేసింది. అయితే ఈ వీడియోలకు ఇప్పటివరకు అమెరికావైపు నుండి ఎలాంటి రిప్లైలు రాలేదు.

ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus