టాలీవుడ్ టాప్ బ్యానర్లో ‘మైత్రి మూవీ మేకర్స్’ ఒకటి. అలాంటిది ఈ బ్యానర్..కి ఫ్లాప్ సెంటిమెంట్ ఏంటి? అనే డౌట్ ఎవ్వరికైనా రావొచ్చు. అది సహజం. నిజమే..! ‘మైత్రి..’ టాలీవుడ్ టాప్ బ్యానర్స్ లో ఒకటి. మరో రకంగా టాలీవుడ్ లీడింగ్ బ్యానర్ అని కూడా చెప్పొచ్చు. కాకపోతే ‘మైత్రి’ కెరీర్ ప్రారంభం నుండీ ఓ బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతోంది. అలాగే ఈ బ్యానర్ కి మరో సక్సెస్ సెంటిమెంట్ కూడా ఉంది. ఆ రెండు సెంటిమెంట్లు ఈ 2026 తో బ్రేక్ అయ్యాయి అనే చెప్పాలి.
విషయంలోకి వెళితే.. ‘మైత్రి..’ నుండీ ఒక స్టార్ హీరో సినిమా వచ్చింది అంటే.. బాక్సాఫీస్ వద్ద అది మినిమమ్ గ్యారెంటీ అనే ముద్ర ఉంది. మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ పెద్ద హిట్ అయ్యింది. ‘సర్కారు వారి పాట’ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కూడా బాగానే ఆడింది. రామ్ చరణ్ ‘రంగస్థలం’ పెద్ద హిట్.. ‘పెద్ది’ కూడా బాగానే ఆడింది. ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ పెద్ద బ్లాక్ బస్టర్. ‘డ్రాగన్’ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అల్లు అర్జున్ ‘పుష్ప’ ‘పుష్ప2’ రెండూ పెద్ద హిట్లు.బాలయ్య తో చేసిన ‘వీరసింహారెడ్డి’ మంచి సక్సెస్ అందుకుంది. చిరంజీవితో చేసిన ‘వాల్తేరు వీరయ్య’ కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది.
మరోవైపు ‘మైత్రి’ మిడ్ రేంజ్ హీరోలతో చేసిన సినిమాలు అల్మోస్ట్ అన్నీ ఫ్లాప్ అయ్యాయి. నాని ‘గ్యాంగ్ లీడర్’ ‘అంటే సుందరనికీ’ రెండూ ఫ్లాప్. విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ ‘ఖుషి’ రెండూ అనుకున్నంత ఆడలేదు. రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’, నాగ చైతన్య ‘సవ్యసాచి’, నితిన్ తో చేసిన ‘రాబిన్ హుడ్’, కళ్యాణ్ రామ్ తో చేసిన ‘అమిగోస్’, ఇలా ‘మైత్రి’ నిర్మించిన మిడ్ రేంజ్ సినిమాలు అన్నీ ఫ్లాపులే. ‘ఉప్పెన’ ‘మత్తువదలరా’, ‘మత్తువదలరా 2’ మాత్రం ఓకే. అవి చిన్న సినిమాలుగా రూపొంది బాగానే ఆడాయి.కానీ మిడ్ రేంజ్ హీరోలతో చేస్తే ఫ్లాప్ అనే ముద్ర ఈ బ్యానర్ పై బలంగా ఉంది.
కాకపోతే ఈ 2026 తో ఆ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది అనే చెప్పాలి. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘మైత్రి..’ నిర్మించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమా కనీసం రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ ను కూడా అందుకోలేదు. మరోవైపు ‘మైత్రి’ వారు మిడ్ రేంజ్ హీరో అయిన రవితేజతో ‘ఇరుముడి'(Irumudi) సినిమాని నిర్మించారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. రవితేజ కెరీర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ ను సాధించింది. 2 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించి రూ.100 కోట్ల వసూళ్ళ దిశగా దూసుకుపోతోంది.