‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) తర్వాత రాంచరణ్ (Ram Charan) హీరోగా వచ్చిన సినిమా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) . సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అయ్యింది. కానీ మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ రావడంతో.. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా నిలబడలేకపోయింది. శంకర్ (Shankar) ఈ చిత్రానికి దర్శకుడు. దిల్ రాజు (Dil Raju) కెరీర్లో 50వ సినిమాగా రూపొందింది. ఈ సినిమా కోసం ఆయన దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్ పెట్టారు.
కానీ సినిమా ఆడకపోవడం వల్ల ఆయనకు చాలా నష్టాలు వచ్చాయి. మరోపక్క ‘గేమ్ ఛేంజర్’ సినిమాకి చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యింది. సోషల్ మీడియాలో ఈ సినిమాని ఏకి పారేశారు నెటిజన్లు. వాళ్ళ సంగతి పక్కన పెడితే.. సినిమా రిలీజ్ అయిన 4,5 రోజులకే దర్శకుడు శంకర్.. ఈ సినిమా ఔట్పుట్ విషయంలో సంతృప్తి చెందలేదని.. 5 గంటల సినిమా తీసి దాన్ని సరిగ్గా వాడుకోలేకపోయాను’ అన్నట్టు స్టేట్మెంట్ ఇచ్చి సినిమాని మరింతగా కిల్ చేశాడు అని చెప్పాలి.
‘కర్ణుడి చావుకి కోటి కారణాలు’.. అన్నట్టు ‘గేమ్ ఛేంజర్’ ప్లాప్ అవ్వడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి అని వినికిడి. ముఖ్యంగా ఈ సినిమాకి కథ అందించింది దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraj). అతను ఇచ్చిన కథని శంకర్ సరిగా వాడుకోలేదట. ‘అప్పన్న’ పాత్రకు సంబంధించిన లైన్.. అతనే ఇచ్చాడట. ఆ పాత్రకి చాలా లెటర్స్ అల్లాడట. కానీ శంకర్ మాత్రం ఆ పాత్రని షార్ట్ చేసేసి.. అనవసరమైన రివేంజ్ ట్రాక్ తగిలించాడు అని ఇన్సైడ్ టాక్. దీంతో కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraj) కథకి న్యాయం జరగలేదు అని స్పష్టమవుతుంది.