Allu Aravind: ‘తండేల్’ గురించి అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు!

నాగ చైతన్యకి  (Naga Chaitanya)  ‘100 % లవ్’ (100% Love)  అనే మంచి కమర్షియల్ హిట్ అందించి.. అతని కెరీర్ కి ఊపిచ్చింది అల్లు అరవింద్ (Allu Aravind). బన్నీ వాస్ (Bunny Vasu) మెయిన్ నిర్మాత అయినప్పటికీ.. అల్లు అరవింద్ ఫైనల్ చేశాకే అది సెట్స్ పైకి వెళ్ళింది. ఫైనల్ గా ఆయన చూసి ఓకే చేశాకే అది బయటకు వచ్చింది. మళ్ళీ ఇదే కాంబినేషన్లో ‘తండేల్’  (Thandel)  రూపొందింది. ఈ సినిమాపై కూడా నిర్మాత అల్లు అరవింద్ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

Allu Aravind

ఈ రోజు జరిగిన ‘తండేల్’ ట్రైలర్ లాంచ్లో ఆయన కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ” ‘చైతూ చైతూ’ అని ఈరోజు మీరు అరుస్తున్నారు. కానీ నేను సంవత్సరం నుండి అంటున్నాను.మేము చాలా కష్టపడి ఈ సినిమా తీశాము. మేము ఎంత కష్టపడి తీసినా.. ఫైనల్ గా అది మీకు నచ్చాలి. మీరు ఆదరించడంలో మా ఆనందం ఉంటుంది.

ఈ సినిమాని కచ్చితంగా మీరు ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను. కార్తీక్ తీడ అందించిన బేసిక్ కథని చందూ మొండేటి.. అందరికీ నచ్చే విధంగా తీశారు. నాగ చైతన్య ఏ సినిమాలోనూ నటించని స్థాయిలో ‘తండేల్’ లో నటించారు. కొన్ని సార్లు గుండెని పిండేసారు అని కూడా చెప్పాలి. కచ్చితంగా ఈ సినిమాలో చైతూ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు.

‘తండేల్’ అనేది శ్రీకాకుళంలో జరిగిన నిజమైన కథ. కచ్చితంగా ఇది అందరినీ ఆకట్టుకుంటుంది. దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)  ఈ సినిమా సంగీతం విషయంలో చింపి పారేశాడు. వైజాగ్, శ్రీకాకుళం ప్రేక్షకుల కథ ఇది. కచ్చితంగా దీన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.

ప్రేమ కోసం జైలుపాలయ్యే పాత్రలో ప్రభాస్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus