Vijay – Jason Sanjay: విజయ్‌కి మరో షాక్‌ ఇవ్వబోతున్న కొడుకు.. సినిమా రిలీజ్‌ అయితే కానీ తెలియదు

సినిమాలు వదిలేసి.. రాజకీయాల్లోకి వద్దామనుకుని.. అన్నీ ప్లాన్ చేసుకొని బరిలోకి దిగారు ప్రముఖ తమిళ కథానాయకుడు విజయ్‌. ఇలా పార్టీ కార్యక్రమాలు స్టార్ట్ చేశారో లేదో.. బహిరంగ సభలో అపశ్రుతి జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కాస్త గ్యాప్‌ ఇచ్చి తిరిగి పార్టీ పనులు ప్రారంభిస్తే.. తన సినిమా ‘జన నాయగన్‌’కు సెన్సార్‌ చిక్కులు వచ్చాయి. అవి ఇంకా తేలలేదు అనుకుంటుండగా.. భార్య సంగీత విడాకుల కోసం కోర్టమెట్లు ఎక్కారు. ఇలా ఏదో ఒక సమస్య వస్తూ ఉంది.

Vijay – Jason Sanjay

ఈ సమస్యలు ఇలా ఉండగా తన కొడుసు జేసన్‌ సంజయ్‌ మొన్నీమధ్య చిన్న షాక్‌ ఇచ్చాడు. అలా తల్లి సంగీత విడాకుల కోసం న్యాయస్థానానికి వెళ్లగానే తండ్రిని సంజయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశాడు. ఆ విషయమే ఇంకా తేలడం లేదు అనుకుంటుండగా.. ఇప్పుడు మరో షాక్‌ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెబుతున్నారు. అదే తన కొత్త సినిమాలో టైటిల్‌ కార్డు విషయంలో సంప్రదాయాన్ని పక్కన పెట్టి పేరు మార్చేద్దాం అనుకుంటున్నాడట. ఈ మేరకు కోడంబాక్కం వర్గాల్లో ఒకటే చర్చ జరుగుతోంది.

సందీప్ కిషన్ హీరోగా ‘సిగ్మా’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు జేసన్‌ సంజయ్‌. ఈ సినిమా పనులు తుది దశలో ఉన్నాడు. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తారు. ఆ విషయం పక్కనపెడితే తమిళనాట ప్రతి మగాడు తన పేరు చివర తండ్రి పేరును రాస్తుంటారు. ఇది ఎన్నో ఏళ్లుగా వస్తోంది. అయితే ‘సిగ్మా’ సినిమా క్రెడిట్స్‌లో తండ్రి పేరు లేకుండా కేవలం జేసన్‌ సంజయ్‌ అని మాత్రమే వేయాలని అనుకుంటున్నాడట. అంటే జేసన్ సంజయ్ విజయ్ అని కాకుండా కేవలం జేసన్ సంజయ్ అని వేసుకోవాలని అనుకుంటున్నాడట.

ఒకవేళ ఇదే జరిగితే విజయ్‌ బాధపడతాడు. అన్నట్లు విజయ్‌ ఎప్పుడూ తన తండ్రి పేరు (ఎస్‌.ఎ.చంద్రశేఖర్‌) తన పేరు చివర పెట్టుకోలేదు. ఇప్పుడు జేసన్‌ కూడా అదే పని చేస్తే తండ్రిని ఫాలో అయినట్లు అవుతుంది. విజయ్‌ విషయంలో ఏదో కారణం ఉంటే.. ఇప్పుడు సంజయ్‌ విషయంలో విజయ్‌నే కారణం.

విజయ్‌కి కథ చెప్పిన నాని డైరక్టర్‌.. దాదాపు ఓకేనట.. మరెప్పుడు?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus