Vijay: విజయ్‌కి కథ చెప్పిన నాని డైరక్టర్‌.. దాదాపు ఓకేనట.. మరెప్పుడు?

‘టాక్సీవాలా’ తర్వాత విజయం అందుకుని ఎనిమిదేళ్లు అవుతున్నా.. విజయ్‌ దేవకొండ జోరు ఆగడం లేదు. ప్రస్తుతం చేతిలో రెండు సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. ఇప్పుడు మూడో సినిమాకు కూడా రెడీ అయిపోయాడని సమాచారం. నానికి ఓ మరపురాని సినిమాను ఇచ్చిన యువ దర్శకుడు విజయ్‌కి ఇటీవల లైన్‌ చెప్పి ఓకే చేయించుకున్నారని సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ ఉగాదికి ఆ సినిమా ప్రకటన కూడా ఉంటుంది అని సమాచారం.

Vijay – Shouryuv

విజయ్‌ దేవరకొండ ‘రణబాలి’, ‘రౌడీ జనార్ధన’ సినిమాలతో బిజీగా ఉన్నారు. పెళ్లి పనులు, సంబరాలు, సరదాలు అయిపోయాక ఇప్పుడు సినిమా సెట్‌లో అడుగుపెట్టాడు. ఈ క్రమంలో ఎక్కడ గ్యాప్‌ దొరికిందో ఏమో నాని ‘హాయ్‌ నాన్న’ ఫేమ్‌ శౌర్యువ్‌ ఓ స్టోరీ లైన్‌ వినిపించేశారట. ఇంట్రెస్టింగ్‌గా ఉండటంతో పూర్తి కథ సిద్ధం చేసుకోమని విజయ్‌ చెప్పాడట. ఆ పని కూడా దాదాపు అయిపోవచ్చిందని చెబుతున్నారు. అందులో త్వరలో అనౌన్స్‌మెంట్‌ అని చెబుతున్నారు.

ఇక విజయ్‌ నుండి ఈ ఏడాదిలో ‘రణబాలి’, ‘రౌడీ జనార్ధన’ వచ్చేస్తున్నాయి. ఆ వెంటనే శౌర్యువ్‌ సినిమా పట్టాలెక్కుతుందని సమాచారం. అయితే దీని కోసం కాస్త మేకోవర్‌ అవసరమని.. దానికి ఒకట్రెండు నెలల గ్యాప్‌ ఇస్తారని టాక్‌. ‘హాయ్‌ నాన్న’ సినిమా లాంటి ఎమోషనల్ కథతో కాకుండా ఈ సారి మైథలాజికల్‌ టచ్‌తో సాగే స్క్రిప్ట్‌ను శౌర్యువ్‌ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమా కూడా ‘హాయ్‌ నాన్న’ సినిమా నిర్మాణ సంస్థ వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌లోనే ఉంటుంది అని చెబుతున్నారు.

విజయ్‌ ఇప్పటివరకు మైథలాజికల్‌ టచ్‌ ఉన్న సినిమా అయితే చేయలేదు. ఇతర హీరోలు ఇలాంటి సినిమాలు చేసి విజయాలు అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విజయ్‌ కూడా ఇదే ట్రెండ్‌లోకి వచ్చేస్తున్నాడు అని చెప్పొచ్చు. చూద్దాం మరి ట్రెండ్‌ అయినా విజయ్‌కి హిట్‌ ఇస్తుందేమో.

కమర్షియల్‌ సినిమాకు ఓకే చెప్పిన ఆర్‌.నారాయణమూర్తి.. లైఫ్‌లో ఫస్ట్‌ టైమ్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus