Mouli: సడన్ గా మౌళిని వెనకేసుకొస్తున్నారేంటి?

మౌళి తనుజ్ ప్రశాంత్.. అలియాస్ మౌళి(Mouli) సోషల్ మీడియాలో క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ‘మౌళి టాక్స్’ అంటూ హిలేరియస్ కంటెంట్ అందించాడు. తర్వాత ’90’s’ సిరీస్ తో నటుడిగానూ మారాడు. ఆ సిరీస్ సూపర్ హిట్ అయ్యింది. మౌళి నటనకి మంచి పేరొచ్చింది. ఆ వెంటనే అతను హీరోగా నటించిన ‘లిటిల్ హార్ట్స్’ సినిమాకి కూడా సూపర్ హిట్ రెస్పాన్స్ లభించింది. దీంతో అతను హీరోగా కూడా నిలబడేందుకు ఒక మంచి ఛాన్స్ లభించింది.

Mouli

అందుకే ‘మైత్రి మూవీ మేకర్స్’ వంటి సంస్థ మౌళిని పిలిచి కోటి రూపాయల చెక్ ఇచ్చి మరీ ‘DNK'(దొంగ నా కొడుకు) అనే సినిమా చేసే అవకాశాన్ని కట్టబెట్టింది. నవంబర్ 13న ‘DNK’ రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా సినిమాలో చాలా డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్నాయి. అవి ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ను చాలా ఇబ్బంది పెట్టాయి. అయితే మిక్స్డ్ టాక్ వచ్చినా ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి.

ధియేట్రికల్ రన్ ను చూసుకుంటే వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించింది. మొదటి సోమవారం నుండీ చాలా చోట్ల డెఫిసిట్లు పడ్డాయి. బయ్యర్స్ కి ఈ సినిమా నష్టాలు మిగల్చడం ఖాయం. ఏ సినిమా రిజల్ట్ అయినా డిసైడ్ అయ్యేది.. ధియేట్రికల్ రన్ ను ఆదారం చేసుకునే. ట్రేడ్ పండితులు, మీడియా వర్గాలు కూడా వాటిని ఆదారం చేసుకునే సినిమా రిజల్ట్ ను వెల్లడిస్తాయి. అయితే సడన్ గా కొంతమంది మీడియా ప్రతినిధులు ‘DNK’ సినిమాని, మౌళిని వెనకేసుకొస్తున్నాయి.

‘DNK’ సినిమాని కేవలం రూ.5 కోట్ల బడ్జెట్లోనే తీశారని, ధియేట్రికల్ రన్ రూ.8 కోట్ల వరకు వచ్చిందని, సొ సినిమాకి నష్టాలు లేవని కొంతమంది మీడియా ప్రతినిధులు చెప్పుకొచ్చారు. అంతేకాదు.. మౌళి చిన్న పిల్లాడని, ‘DNK’ సినిమా ఫలితాన్ని ఆదారం చేసుకుని అతని భవిష్యత్తు గురించి నెగిటివ్ కామెంట్స్ చేస్తే.. అతన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని వచ్చే కొత్త తరం ఆగిపోతుందని.. అబ్బో ఇలా చాలా విధాలుగా సుగర్ కోటెడ్ కామెంట్స్ చేశారు.

‘DNK’ సినిమా ప్రమోషన్స్ లో మౌళి ప్రదర్శించిన అత్యుత్సాహానికి గాను చాలా మంది విమర్శించారు. ఇక ప్రమోషన్స్ లో ‘మైత్రి’ రవి.. ఈ సినిమాని ఇంకా చూడలేదని .. బాగా వచ్చిందని తన టీమ్ చెప్పినట్టు రివీల్ చేసి పెద్ద షాక్ ఇచ్చారు. ఎంత పెద్ద నిర్మాత అయినా.. తన సినిమా కథ, కథనాలు ఫైనల్ ఔట్పుట్ వంటివి చూసుకోకుండా.. జనాల మీదకి వదిలేయడం అనేది ఎంత వరకు కరెక్ట్. కనీసం ప్రమోషన్స్ లో అయినా హీరోని కంట్రోల్లో పెట్టాల్సిన బాధ్యత వారిపై ఉంది కదా..!

రూ.40 కోట్లకి ‘విశ్వంభర’ నైజాం హక్కులు.. దిల్ రాజు తప్పుకున్నట్టేగా

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus