మెగాస్టార్ చిరంజీవి హీరోగా, ‘బింబిసార’ ఫేమ్ మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర'(Vishwambhara). యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా విడుదలపై మొదటి నుంచి గందరగోళం నెలకొంది. వాస్తవానికి ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అయితే రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా కోసం వెనక్కి తగ్గారు.
ఆ తర్వాత సీజీ వర్క్ కోసం ఎక్కువ టైమ్ తీసుకుంటుండటంతో, చిత్రాన్ని 2026 సమ్మర్‌కు వాయిదా వేస్తున్నట్లు స్వయంగా చిరంజీవి ఓ వీడియో ద్వారా స్పష్టం చేశారు. కానీ ఈ ఏడాది సమ్మర్ కి కూడా ‘విశ్వంభర’ ప్రేక్షకుల ముందుకు రాలేదు. తాజా సమాచారం ప్రకారం, ‘విశ్వంభర’ను 2027 సంక్రాంతి బరిలో నిలపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు ఇండస్ట్రీలో టాక్ బలంగా వినిపిస్తోంది. కానీ అదే సంక్రాంతికి చిరంజీవి మరో సినిమా ‘కాకా’ కూడా విడుదల కానున్నట్లు ఇదివరకే ప్రకటించారు.
ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. ముందుగా ‘విశ్వంభర’ నైజాం థియేట్రికల్ హక్కులను టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు. కానీ సడెన్ గా సడన్ గా ఇప్పుడు ‘మైత్రీ డిస్ట్రిబ్యూషన్’ సంస్థ రేసులోకి వచ్చింది. దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్ తో ‘విశ్వంభర’ ధియేట్రికల్ హక్కులని ‘మైత్రీ’ సంస్థ చేజిక్కించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు దిల్ రాజు ఉత్తరాంధ్ర హక్కులకి షిఫ్ట్ అయ్యారు. దీనికి కారణాలు ఏంటన్నది ఇంకా బయటకి రాలేదు.