‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కెరీర్లో భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా. దాదాపు 5 ఏళ్ళ పాటు కష్టపడి మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈపాటికే ఈ సినిమా రిలీజ్ కావాలి. కానీ అలా జరగలేదు. మొదట మార్చి 28 అని ప్రకటించారు. తర్వాత మే 30 అన్నారు.తర్వాత జూన్ 12 కి మారింది. ఇప్పుడు ఆ డేట్ కి కూడా ‘హరిహర వీరమల్లు’ రాకపోవచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
విషయం ఏంటంటే.. ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ మరోసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు కారణాలు లేకపోలేదు. నిర్మాత ఏ.ఎం.రత్నం (AM Rathnam) ఈ సినిమా కోసం భారీగా బడ్జెట్ పెట్టారు. రూ.150 కోట్లు అనుకుంటే అది రూ.200 కోట్లు దాటింది. ఈ క్రమంలో ఫైనాన్సియల్ సెటిల్మెంట్లు చాలా ఉన్నాయి అని తెలుస్తుంది. ఇవన్నీ ఓ కొలిక్కి తెచ్చుకుని.. క్లియరెన్స్..లు వంటివి తెచ్చుకుంటే తప్ప.. రిలీజ్ కాని పరిస్థితి.
ప్రస్తుతం ఏ.ఎం.రత్నంకి ఆరోగ్యం బాలేదు. సో కొంచెం టైం పడుతుంది. అన్నీ సెట్ అయ్యి ప్రేక్షకుల ముందుకు తీసుకురాడానికి మరో వారం టైం పట్టే అవకాశం ఉంది. సో జూన్ 19 లేదా జూన్ 20న ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ‘కుబేర’ (Kubera) జూన్ 20 కి రిలీజ్ అవుతున్నట్టు ప్రకటించారు. మరి ఆ సినిమాని వెనక్కి జరుపుతారా? లేక వారం ముందుకి జరుపుతారా? లేక పోటీగా రిలీజ్ చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.
‘హరిహర వీరమల్లు’ మరో వారం వెనక్కి జరిగే అవకాశం ఉంది! జూన్ 19 లేదా 20 ని రిలీజ్ చేయడానికి చర్చలు నడుస్తున్నాయి.. మరి ‘కుబేర’ సంగతేంటి?#HariHaraVeeraMallu #pawankalyan #Kuberaa
— Phani Kumar (@phanikumar2809) June 3, 2025