పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘బద్రి’ చిత్రంతో క్లోజ్ అయ్యి.. ఆ తరువాత సహజీవనం కూడా చేశారు పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్. ఆ తరువాత మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు కూడా..! అయితే కొన్ని మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఈ క్రమంలో పవన్ మరో విదేశీ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. ఈ క్రమంలో అఖీరా, ఆధ్య ల బాగోగులు దగ్గరుండి చూసుకుంటుంది రేణు దేశాయ్. అయితే ఓ సారి తనకి ఒంట్లో బాగోలేని టైములో తనకి కూడా ఓ తోడు కావాలని అనిపించి వివాహం చేసుకోవాలని డిసైడ్ అయినట్టు తెలిపింది.
పిల్లల బాగోగులను తండ్రి పవన్ కళ్యాణ్ దగ్గరుండి చూసుకుంటున్నాడు కాబట్టి.. తన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో రేణూ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఆ టైములో పవన్ ఫ్యాన్స్ ఈమెను విమర్శించినా ఈమె లెక్క చెయ్యలేదు. ‘కళ్యాణ్ గారు మరో పెళ్ళి చేసుకుంటే తప్పులేదు.. కానీ నేను మరో పెళ్ళి చేసుకుంటే తప్పు వచ్చిందా?’ అంటూ ఈమె కూడా గట్టి కౌంటర్లు వేసింది.
అయితే ఈమెకు ఎంగేజ్మెంట్ అయిన వ్యక్తి ఫోటోని మాత్రం రివీల్ చెయ్యలేదు. ఇదిలా ఉంటే.. ఈ లాక్ డౌన్ టైములో రేణు దేశాయ్ కూడా సీక్రెట్ గా రెండో పెళ్ళి చేసుకున్నట్టు వార్తలు ఊపందుకున్నాయి. దీనికి ప్రధాన కారణం ఇటీవల రేణు దేశాయ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొత్త ఫోటోలలో రేణు మెడలో నల్ల పూసలు ఉండడంతో.. అంతా ఫిక్స్ అయిపోయారు. మరి నిజంగానే రేణు .. సీక్రెట్ గా రెండో పెళ్ళి చేసేసుకుందా? అనేది ఆమెనే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
Most Recommended Video
మేకప్ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్ వందాల్’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!