ప్రభాస్ – ప్రశాంత్ నీల్‌ల ‘సలార్’ సినిమా ఇప్పటికే ఓసారి వాయిదా పడింది. ఎందుకు, ఏంటి అనే విషయాలు గురించి క్లారిటీగా చెప్పలేదు కానీ… సినిమాని అయితే వాయిదా వేసేశారు. నాణ్యత, వర్క్ పెండింగ్ లాంటి మాటలు చెప్పినా అసలు కారణం అది కాదు అని చెబుతున్నారు. ఇప్పుడు ఈ చర్చ ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకు అంటే సినిమా కొత్త రిలీజ్ డేట్ విషయంలోనూ మళ్లీ డౌట్ రావడమే కారణం. తొలిసారిలాగే ఈ సారి కూడా జరుగుతుంది అని పుకార్ల సారాంశం మాత్రమే.
‘సలార్’ (Salaar) సినిమాను రెండు పార్టులుగా విడుదల చేస్తామని చిత్రబృందం కొన్నాళ్ల క్రితమే చెప్పేసింది. తొలి పార్టును ‘సలార్: ది సీజ్ ఫైర్’ అని పేరు కూడా పెట్టేశారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రచారం ఇంకా ఆశించిన స్థాయిలో జరగడం లేదు. మొన్నీమధ్య 50 రోజుల్లో సినిమా రిలీజ్ అంటూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కానీ ఆ తర్వాత పెద్దగా కంటెంట్ ఏమీ బయటకు రాలేదు. దీంతో ఇప్పుడు కూడా అప్పుడు లాగా సినిమా వాయిదా వేసేస్తారా అంటూ ఓ ప్రశ్న సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కొంతమంది అయితే సినిమాను మార్చి 2024కు వాయిదా వేసేస్తున్నారు అంటూ ఓ ప్రచారం ప్రారంభించారు. ప్రభాస్ సినిమాలకు సంబంధించి అప్‌డేట్స్ గతంలో ఇచ్చిన ట్విటర్ హ్యాండిల్స్ కూడా ఇలాంటి ట్వీట్లు కనిపించాయి. దీంతో నిజంగానే సినిమా వాయిదా వేసేస్తున్నారా అనే వాదన మొదలైంది. దీనికి కారణం ఇంకా కొన్ని ఏరియాల్లో తాము అనుకున్న బిజినెస్ అవ్వలేదని నిర్మాతలు భావించడమే కారణం అంటున్నారు. సెప్టెంబరు టు డిసెంబరు వాయిదాకు కూడా అదే కారణం అని చెబుతున్నారు.
మరికొందరు అయితే తొలిసారి వాయిదాకు కారణమైన వీఎఫ్‌ఎక్స్, యాక్షన్ సన్నివేశాలు ప్యాచ్ వర్క్ ఇప్పుడూ కారణం అని చెబుతున్నారు. అయితే ‘సలార్’ దెబ్బకు షారుఖ్ ఖాన్ ‘డంకీ’ వాయిదా పడుతుంది అంటూ ఆ మధ్య ప్రచారం చేసిన వాళ్లు లేటెస్ట్ పుకార్లు చూసి తలలపట్టుకుంటున్నారని మరో టాక్.
మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!