Dunki: ‘డంకీ’ గురించి ఊహించని రూమర్‌… నిజమేనా అంటూ ఫ్యాన్స్‌ ప్రశ్న!

  • October 23, 2023 / 05:51 PM IST

సినిమా పోస్టర్‌ను చూసి కథను చెప్పేస్తున్న రోజులివి. ఇక్కడో విషయం ఏంటంటే.. అలా చెప్పిన కథలు దాదాపు కరెక్ట్‌ అవుతున్నాయి. అయితే ఈ కథలు చెప్పే క్రమంలో ఇటీవల కాలంలో ఎక్కువగా ఆ సినిమా, మరో సినిమాకు రీమేక్‌ అంటూ పుకార్లు వస్తున్నాయి. అలా తాజాగా పుకార్ల షికార్లు జరుగుతున్న సినిమా ‘డంకీ’. బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌, వైవిధ్య చిత్రాల దర్శకుడు రాజ్‌ కుమార్ హిరాణీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఆ సినిమా గురించే లేటెస్ట్‌ పుకారు అన్నమాట.

వరుస పరాజయాలతో డీలా పడ్డ బాలీవుడ్‌ను తిరిగి పట్టాలెక్కించే ప్రయత్నంలో ఉన్నాడు షారుఖ్‌ ఖాన్‌. ఈ క్రమంలో రెండు భారీ సిక్సర్లు కొట్టి ఊపు తీసుకొచ్చాడు. తొలుత ‘పఠాన్‌’ అంటూ బాలీవుడ్‌ దర్శకుడితో వచ్చి విజయం సాధించగా, రెండోసారి ‘జవాన్‌’ అంటూ తమిళ దర్శకుడితో వచ్చి హిట్‌ కొట్టాడు. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాతో విజయం సాధించి హ్యాట్రిక్‌ సాధించే పనిలో ఉన్నాడు. అదే ‘డంకీ’.

ఈ సినిమా డిసెంబరు 22న విడుదల కావాల్సి ఉండగా… తాజాగా ఓ స్టెప్‌ ముందుకేసి డిసెంబరు 21న విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సినిమా కొత్త పోస్టర్‌ను కూడా లాంచ్‌ చేఅఆరు. అయితే ఈ సినిమా ఓ పంజాబీ సినిమాకు రీమేక్ అనే వార్త ఒకటి బయిటకు వచ్చింది. అఫీషియల్ రీమేకా లేదంటే లేదా సిమిలర్ స్టోరీ లైన్‌ తీసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది అంటున్నారు. అయితే ఈ విషయంలో చిత్రబృందం నుండి ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

పంజాబీలో గతేడాది వచ్చిన ‘ఆజా మెక్సికో చలియే’ అనే సినిమా కథకు, (Dunki) ‘డంకీ’కి దగ్గరి సంబంధం ఉంది అనేది లేటెస్ట్‌ టాక్‌. అక్రమంగా సరిహద్దులు దాటి అమెరికాలో ప్రవేశించే వారు జైళ్లలో మగ్గుతున్న ఉదంతాలు వార్తల్లో చదివే ఉంటారు. ‘ఆజా మెక్సికో చలియే’ కూడా అలాంటి కథనే. ఇప్పుడు ‘డంకీ’లో కూడా ఇదే పాయింట్‌ కీలకం అని చెబుతున్నారు. మెక్సికో సరిహద్దులు దాటి అమెరికాలో అడుగుపెట్టే వారు ఉపయోగించే రోడ్‌ను డాంకీ రోడ్స్ అంటారట. అందుకే సినిమాకు ఆ పేరు పెట్టారనే ప్రచారమూ ఉంది.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus