హీరోయిన్ విషయంలో నిర్మాతల మాట వినని సిద్ధు?

Advertisement

నటుడు సిద్దు జొన్నలగడ్డ సినిమా ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లు అవుతున్నా.. ఈ మధ్యకాలంలోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పటివరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసిన సిద్దు ఆ తరువాత హీరోగా మారాడు. రీసెంట్ గా ఈ హీరో నటించిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’, ‘మా వింత గాధ వినుమా’ లాంటి సినిమాలు ఓటీటీలో విడుదలై సక్సెస్ అందుకున్నాయి. యూత్ కి నచ్చే అంశాలు సినిమాలో ఉండేలా చూసుకుంటూ.. అతి తక్కువ బడ్జెట్ లో మినిమమ్ గ్యారెంటీ సినిమాలు తీయాలనే నిర్మాతలకు సిద్ధూ మంచి ఆప్షన్ గా కనిపిస్తున్నాడు.

ప్రస్తుతం ఇతడి చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. తనకే బడ్జెట్ ఇచ్చేసి సినిమా తీసిపెట్టమని అడిగే నిర్మాతలు కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా.. సిద్ధు జొన్నలగడ్డ వరుసగా నటించిన రెండు సినిమాలలో హీరోయిన్ గా సీరత్ కపూర్ నటించింది. ముద్దు సీన్లకు, హాట్ అండ్ బోల్డ్ సన్నివేశాల్లో నటించడానికి ఎలాంటి అభ్యంతరాలు చెప్పని సీరత్ ఓటీటీ కంటెంట్ కి కావాల్సిన కంటెంట్ ఇవ్వడంలో మొహమాటాలు పెట్టుకోదు. దీంతో తన సినిమాలకు సీరత్ నే రికమెండ్ చేస్తున్నాడట సిద్దు.

‘మా వింత గాధ వినుమా’ సినిమా చూసిన తరువాత నిర్మాతలు సీరత్ కపూర్ వద్దని చెబుతున్నా.. కానీ సిద్ధు మాత్రం ఆమె ఉంటేనే బాగుంటుందని పట్టు పడుతున్నాడని ప్రచారం జరుగుతోంది. అదే బడ్జెట్ లో వేరే హీరోయిన్లు దొరుకుతారని తెలిసినా కానీ సిద్ధూ ఆమె పట్లే ఆసక్తి చూపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘రన్ రాజా రన్’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సీరత్ సరైన అవకాశాలను దక్కించుకోలేకపోయింది. నటన సరిగ్గా రానప్పటికీ తన గ్లామర్ షోతో ఇండస్ట్రీలో అరకొర అవకాశాలతో నెట్టుకొస్తోంది.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news