SSMB28: మహేష్‌ – త్రివిక్రమ్‌ సినిమా హీరోయిన్‌ మార్చేస్తున్నారా…

  • January 6, 2023 / 07:42 PM IST

మహేష్‌ బాబు – త్రివిక్రమ్‌ సినిమాలో చాలా మార్పులు జరుగుతున్నాయి. సినిమా అనౌన్స్‌ చేసే ముందో, మొదలుపెట్టాక ముందో జరగాల్సిన చర్చలు, లెక్కలు ఇప్పుడు వేస్తున్నారు. ఆఖరికి సినిమా షూటింగ్‌ మొదలయ్యాక కూడా మార్పులు చేస్తున్నారు. ఈ మార్పులు ఏ లెవల్‌కి చేరాయి అంటే.. ఏకంగా కథనే మార్చేంతగా. ఈ నేపథ్యంలో సినిమాలో హీరోయిన్‌ కూడా మారుతుందా? ప్రస్తుతం టాలీవుడ్‌లో దీని గురించే చర్చ నడుస్తోంది. మహేష్‌బాబు – త్రివిక్రమ్‌ సినిమాను #SSMB28 అంటూ ఘనంగా ప్రకటించారు.

‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత హ్యాట్రిక్‌గా సినిమా చేస్తున్నాం అంటూ చెప్పుకొచ్చారు కూడా. అయితే సినిమా ప్రారంభం విషయంలో పరిస్థితులు ఏమంత బాగోలేవు. బాలారిష్టాలు మొదలయ్యాయి. సినిమా గురించి ఏం చెప్పినా.. అది అనుకున్న సమయానికి జరగడం లేదు. ఇప్పుడు మొత్తం కథనే మార్చేశారు అని చెబుతున్నారు. దీంతో సినిమాలో హీరోయిన్‌ను కూడా మార్చేశారు అని ఓ టాక్‌ నడుస్తోంది. త్రివిక్రమ్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండటం అనేది పరిపాటి.

అందులో రెండో హీరోయిన్‌కు పెద్దగా పాత్రేమీ ఉండదు. కానీ ఆ పాత్ర కోసం కాస్త పేరున్న, గ్లామర్‌ ఉన్న నాయికనే తీసుకుంటూ ఉంటారు. అలా #SSMB28లో కూడా కుర్ర హీరోయిన్‌ను తీసుకోవాలని అనుకున్నారు. అందుకోసం శ్రీలీల పేరు వినిపించింది. అయితే పాత్ర పరంగా పెద్దగా అవకాశం లేకపోవడంతో ఆమె నో చెప్పింది అని కూడా వార్తలొచ్చాయి. అయితే చిన్నపాటి మార్పులతో ఆమె అప్పుడు ఓకే చేసింది అని అంటున్నారు.

అయితే ఇప్పుడు చూస్తే సినిమా కథ మొత్తం మారిపోయింది. ఈ క్రమంలో నాయికగా ఆమెనే కొనసాగిస్తారా లేదా అనేది తెలియడం లేదు. ప్రాధాన్యం లేకపోతే స్టార్‌ హీరో సినిమా అయినా చేయను అని శ్రీలీల భీష్మించుకుని కూర్చుంది అనేది టాక్‌ మరి. దీంతో మహేష్‌ సినిమా కోసం మరో నాయికను వెతుకుతున్నారు అనే మాటలు వినిపిస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాలంటే సినిమా మొదలవ్వాల్సిందే అంటున్నారు. అయితే అదెప్పుడు అనేది తెలియడం లేదు.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus