సినిమాలు, సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్లు ఇవ్వడం జాన్వీ కపూర్‌కి (Janhvi Kapoor) డైలీ రొటీన్. ఇది ప్రొఫెషనల్ లైఫ్. ఇక పర్సనల్ లైఫ్‌లో ఆమెకు ఏ మాత్రం కాస్త సమయం చిక్కినా తిరుమల శ్రీవారి సన్నిధికి వచ్చేస్తుంది. ఏటా ఆమె తిరుమల చాలాసార్లు దర్శించుకుంటూ ఉంటుంది. అంతగా ఆమెకు దేవుడి మీద భక్తి ఉంది. అది కేవలం వేంకటశ్వర స్వామి మీద కాదు.. దేవుళ్లను ఆమె ఎక్కువగా కొలుస్తూ ఉంటుంది. అలా ఆమె ఇటీవల హైదరాబాద్‌లోని ఓ దేవాలయానికి వచ్చింది.
అమీర్‌పేటలోని ఓ ఆంజనేయుడి దేవాలయంలో జాన్వీ కపూర్ ఇటీవల ప్రత్యేక పూజలు నిర్వహించింది. దానికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. అయితే ఆమె ఇప్పుడు ఎందుకు ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చింది అనే డౌట్ మీకు ఇప్పటికే వచ్చి ఉంటుటంది. అయితే ఆమె పర్సనల్, ప్రొఫెషనల్ ట్రిప్‌గా హైదరాబాద్ వచ్చింది అని తెలుస్తోంది. ప్రొఫెషనల్ లైఫ్ అంటే రామ్ చరణ్ (Ram Charan) సినిమా పనుల గురించి అని. రామ్‌చరణ్ – బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్లో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో జాన్వీ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలసిందే.
ఈ సినిమా షూటింగ్ ఈ నెల 22 నుండి మైసూరులో జరుగుతుంది అని ఇటీవల వార్తలొచ్చాయి. దానికి సంబంధించిన ఫొటో షూట్ ఇటీవల హైదరబాద్‌లో నిర్వహించారట. రామ్‌చరణ్ – జాన్వీ కాంబినేషన్లో ఈ షూట్ చేశారట. మరి సినిమా ప్రారంభం సందర్భంగా ఆ ఫొటోలతో ఏమన్నా పోస్టర్ రిలీజ్ చేస్తారేమో చూడాలి. ఇక ఈ సినిమా గురించి చూస్తే. ‘పెద్ది’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా రూరల్ స్పోర్ట్స్ నేపథ్యంలో సాగుతుంది అని అంటున్నారు.
ఇందులో చరణ్ ఆ క్రీడ శిక్షణ అందించే వ్యక్తిగా కనిపిస్తాడు. రెండు ఏజ్ల పాత్రల్లో చరణ్ కనిపిస్తాడట. ఒక క్రీడాకారుడిగా యువకుడిలా, మరోటి గరువుగా మధ్య వయస్కుడిగా కనిపిస్తాడట. ఇప్పుడు యువకుడిగా కనిపించే సన్నివేశాలతోనే సినిమా పనులు మొదలవుతాయి అని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వస్తుంది. ఇక చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ను జనవరి 10న తీసుకొస్తాం అంటున్నారు.