ఎక్కడబ్బా ఈ స్టార్‌ హీరోల లంచ్‌… అందరూ కలసి అదిరిపోయే హై ఇచ్చారుగా

ఇద్దరు స్టార్‌ హీరోలు కలసి ఒక ఫొటోలో కనిపిస్తేనే అభిమానుల ఆనందానికి హద్దులు ఉండవు. ఆ ఫొటోను షేర్‌ చేసి మురిసిపోతుంటారు అలాంటి ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఏకంగా నలుగురు స్టార్‌ హీరోలు కలసి ఫొటో దిగితే.. ఆ ఫొటో సోషల్‌ మీడియాలో కనిపిస్తే ఇంకెంత వైరల్‌ అవుతుంది చెప్పండి. ఇటీవల జరిగిన ఓ ప్రైవేట్ పార్టీకి సంబంధించిన ఫొటో అది. ఆ పార్టీకి (Tollywood) తెలుగు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

Tollywood

వైరల్‌ అవుతున్న ఆ ఫొటోలో చిరంజీవి (Chiranjeevi) , నాగార్జున(Nagarjuna), మహేష్ బాబు(Mahesh Babu) , రానా, అఖిల్ (Akhil)  తదితరులు కనిపిస్తున్నాయి. అయితే గెడ్డాలు పెంచి ఉండటం, లాంగ్‌ షాట్‌లో ఉండటంతో కొన్ని ఫేస్‌లు సరిగ్గా కనిపించడం లేదు కూడా. కుటుంబ సభ్యులతో కలసి హీరోలు ఈ పార్టీకి హాజరయ్యారు. మాల్దీవుల్లో జరిగింది అంటున్న ఈ పార్టీకి ఇంకా ఎవరెవరు వచ్చారు అనే వివరాలు తెలియడం లేదు.

ఫొటోలో ఉన్న(Tollywood) స్టార్  నటులు ప్రస్తుతం వరుస సినిమాలు, ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో అందరూ ఇలా కలసి ఒక దగ్గరకు చేరడం పెద్ద విషయమే. అందుకే ఈ ఫొటో వైరల్‌ అయింది. ఫుల్‌ పార్టీ, ఎంజాయ్‌ మూడ్‌లో ఉన్నారు అని వాళ్ల బీచ్‌ స్టైల్‌ డ్రెస్సులు చూస్తేనే అర్థమవుతోంది. ఇదంతా ఓకే అందరూ ఓ దగ్గరకు ఎందుకు చేరారు అనేగా.. ఓ ప్రముఖ వ్యాపారవేత్త పుట్టిన రోజు సందర్భంగా ఈ పార్టీ జరిగింది అంటున్నారు.

ఒక్క ఫొటో వస్తేనే ఇలా వైరల్‌ అయింది అంటే.. మొత్తం పార్టీ ఫొటోలు బయటకు వస్తే ఇంకెంత వైరల్‌ అవుతాయో అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. సరదాగా ఓ మాట కూడా అనుకుందాం. ఇంత మంది స్టార్‌లను కలిపి ఓ ఫొటో తీసిన ఆ  స్టార్‌ ఫొటోగ్రాఫర్‌ ఎవరో కదా? ఆ విషయం వదిలేస్తే రాజమౌళి (S. S. Rajamouli) సినిమా కోసం మహేష్‌ సిద్ధం చేస్తున్న లుక్‌ మరోసారి అట్రాక్షన్‌ ఆఫ్‌ ది పిక్‌గా మారింది.

కోవిడ్‌ టైమ్‌లో మంచి ప్రేమకథ రాసిన లోకేశ్‌.. కానీ ఆయన మాటలతో!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus