Trivikram – Haarika Hassine: వరుస డిజాస్టర్లు… అగ్రిమెంట్లు లేని గొప్ప బంధాన్ని విడదీసిందా?

సినిమాను సినిమాగా చూసేవాళ్లకు ఈ విషయం పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. సినిమాను ఇంకాస్త లోతుగా చూసేవారికి ఈ విషయం తెలిసే ఉంటుంది. అదే ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ – ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) బంధం. ఎప్పుడో 1980ల్లో సినిమా నిర్మాణంలోకి వచ్చి.. ఆ తర్వాత బయటకు వెళ్లిపోయిన చినబాబు.. తిరిగి 24 ఏళ్ల తర్వాత నిర్మాతగా మారారు. ఆయన్ను తిరిగి సినిమాల్లోకి తెచ్చింది త్రివిక్రమ్‌ అని అంటారు. అప్పటి నుండి కలసి ఉన్న ఈ నాన్‌ అగ్రిమెంటెడ్‌ బంధం ఆగిపోయింది అని అంటున్నారు.

Trivikram – Haarika Hassine

సినిమా పరిశ్రమలో ఎంత తెలిసినవారైనా పనులన్నీ అగ్రిమెంట్లు, సంతకాల మీద నడుస్తుందని మీకు తెలిసిన విషయమే. అయితే చినబాబు బ్యానర్‌ హారిక హాసిని మధ్య ఎలాంటి సంతకాలు లేవు, అంతా మాటలతోనే సాగుతుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చినబాబు కొడుకు వరుస అయిన నాగవంశీ చెప్పారు. అందుకు తగ్గట్టుగానే 2012 నుండి గత 14 ఏళ్లలో ఎనినిమిది సినిమాలు చేశారు. అందులో ఐదు సినిమాలు బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించాయి. అంటే విన్నింగ్‌ పర్సంటేజీ ఎక్కువ.

అయితే ఆ డిజాస్టర్‌ అయిన మూడు సినిమాలు ఇప్పుడు ఈ మరపురాని బంధాన్ని విడదీశాయని సమాచారం. దీనికి కారణం పోయిన మూడు సినిమాలు నిర్మాతకు డబ్బులు, పరపతి పరంగా భారీ నష్టాన్నే తీసుకొచ్చాయి మరి. ‘అజ్ఞాతవాసి’, ‘గుంటూరు కారం’, ‘ఆదర్శ కుటుంబం’. ఈ మూడు సినిమాలకు భారీగానే సంస్థకు చమురు వదిలింది. దీంతో త్రివిక్రమ్‌ని ఇక డిస్ట్రబ్‌ చేయొద్దని, ఎవరి పని వారు చూసుకుందాం అని ఫిక్స్‌ అయ్యారట.

ఈ క్రమంలోనే మరో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్యను త్రివిక్రమ్‌ కాంటాక్ట్‌ అయ్యారని చెబుతున్నారు. నిజానికి దానయ్య – త్రివిక్రమ్‌ బంధం కూడా పాతదే. ‘జులాయి’ సినిమాకు దానయ్య.. సమర్పకుడు కూడా. నిజానికి హారిక హాసిని క్రియేషన్స్‌, దాని అనుబంధ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్‌కి గత కొన్నేళ్లలో సరైన సినిమాలు రావడం లేదు. మొత్తం తప్పు ఒకరి మీదే నెట్టే ప్రయత్నం సరికాదు అని కూడా చెప్పొచ్చు.

రెండు నెలలు ఇంకా ఉన్నాయి.. రెండు సినిమాల పంచాయితీ తేలుస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus