Chiranjeevi: రెండు నెలలు ఇంకా ఉన్నాయి.. రెండు సినిమాల పంచాయితీ తేలుస్తారా?

ఏ స్టార్‌ హీరో అభిమాని చూడకూడదు అనుకునే పరిస్థితి, ఏ స్టార్‌ హీరో కూడా తనకు రాకూడదు అనుకునే పరిస్థితి ఇప్పుడు మెగాస్టార్‌ చిరంజీవికి వచ్చింది. నిజానికి ఆయనకు ఇది తొలిసారేం కాదు. గతంలో ‘అంజి’ సినిమా విషయంలో ఇలాంటి ఇబ్బందే పడ్డారు. అప్పుడు ఏదైతే కారణం చెప్పారో.. ఇప్పుడు కూడా అదే కారణం. అప్పుడు కారణమేంటి అనేది క్లారిటీ లేదు కానీ.. ఇప్పుడు అయితే విజువల్‌ ఎఫెక్ట్‌లో డొల్లతనం. ఇదంతా చెప్పాక.. ఆ సినిమా పేరు ‘విశ్వంభర’ అని చెప్పేయొచ్చు.

Chiranjeevi

ఇప్పుడు మళ్లీ ఎందుకు ఆ సినిమా గురించి అనుకుంటున్నారా? ఎందుకంటే ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేని ఈ సినిమా విడుదల తేదీ గురించి ఓ చిన్న లీక్‌ వచ్చింది. దీంతో మరోసారి ‘చిరంజీవి రెండు సినిమాల’ ప్రస్తావన మొదలైంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా సంక్రాంతికి వస్తాం అంటున్న ‘విశ్వంభర’ ఈ మధ్య కాస్త కామ్‌ అయింది. దీంతో ముందుగా అనుకున్నట్లు ‘కాకా’ సినిమా సంక్రాంతికి వస్తుందని ఫిక్స్‌ అయ్యారంతా.

కానీ, గత రెండు రోజులుగా వస్తున్న పుకార్ల ప్రకారం చూస్తే.. మరోసారి ‘విశ్వంభర’ ఊసులు టాలీవుడ్‌లో కనిపిస్తున్నాయి. అయితే ఈసారి సంక్రాంతి అనడం లేదు. అయితే రెండు సినిమాల మధ్య గ్యాప్‌ పది రోజులే ఉండబోతోంది అని అంటున్నారు. అయితే అది ముందా, వెనక్కా అనేది ఇక్కడ పాయింట్‌. అంటే ‘కాకా’ సినిమాకు ముందు ‘విశ్వంభర’ వస్తుందా? లేక ‘కాకా’ తర్వాత ‘విశ్వంభర’ వస్తుందా? అనేది ఇక్కడ ప్రశ్న.

తొలుత ‘విశ్వంభర’ వస్తే.. ‘కాకా’ మీద పెద్ద ప్రభావమే పడుతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ సినిమా మీద మార్కెట్‌లో కానీ, ప్రేక్షకుల్లో కానీ, ఆఖరికి అభిమానుల్లో కానీ మంచి ఒపీనియన్‌ లేదు. సంక్రాంతికి ఇంకా రెండు నెలలు ఉన్న నేపథ్యంలో ఈ విషయంలో చిరంజీవి అర్జెంట్‌గా ఓ క్లారిటీ ఇచ్చేయాల్సిన అవసరం ఉంది.

ఇట్లు అర్జున సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus