Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Advertisement

ఇప్పట్లో ఒక సినిమా సెట్స్ పైకి వెళ్ళకముందే ఆ సినిమాలో నటించే నటీనటులు, కథాంశం, టైటిల్ వంటి వివరాలు ఇట్టే బయటకు వచ్చేస్తుంటాయి, సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేస్తుంటాయి. స్టార్ హీరోల సినిమాలకైతే ఈ ‘లీకేజీ’ బెడద ఇంకా ఎక్కువ.

Allu Arjun

కానీ మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) – అట్లీ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న సినిమా విషయంలో మాత్రం ఇలాంటివి జరగకపోవడం విశేషంగానే చెప్పుకోవాలి. ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పటివరకు చిన్న హింట్ కూడా లీక్ అవ్వలేదు అంటే నమ్ముతారా?

మీరు నమ్మకపోయినా ఇది నిజమే..! కనీసం టైటిల్ కూడా బయటకి రాలేదు.బన్నీ- అట్లీ టైటిల్ ఏంటనేది ప్రస్తుతం టాలీవుడ్‌లో అతిపెద్ద సస్పెన్స్ గా మారింది.దర్శకుడు అట్లీ, హీరో బన్నీలకు తప్ప ఈ టైటిల్ గురించి పీ ఆర్ టీమ్ కి కూడా తెలీదట. బన్నీ పర్సనల్ పీఆర్ టీమ్ మిగిలిన విషయాల్లో చేసే హడావిడి.. ఈ సినిమా విషయంలో చేయడం లేదు అంటే అర్దం చేసుకోవచ్చు. ఎల్లుండి అంటే ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు.

కాబట్టి రేపు(ఏప్రిల్ 7న) ఉదయం 11 గంటలకి అల్లు అర్జున్- అట్లీ సినిమాకి సంబంధించి ఒక అప్డేట్ ఇస్తామని మేకర్స్ ప్రకటించడం జరిగింది.దానికి 10 నిమిషాల ముందు మాత్రమే తమ పీఆర్ టీమ్..కి షేర్ చేస్తారట బన్నీ-అట్లీ.ప్రస్తుతానికి ‘వైల్డ్ ఫైర్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కానీ అది ఒరిజినల్ టైటిల్ కాదు అనే టాక్ కూడా వినిపిస్తుంది. చూడాలి మరి ఎలాంటి టైటిల్ ఫిక్స్ చేశారో..!

బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus