‘ఈ కథలో సత్తా ఉంది.. అందుకే నిర్మాతలు ముందుకు వచ్చి మా సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చారు’ అంటూ ‘ఇడుపు కాయితం’ సినిమా ప్రారంభించిన రోజు సినిమా టీమ్ చెప్పింది. నిజానికి సినిమా పేరు, కాన్సెప్ట్, ప్రచార చిత్రాల్లో సినిమాలోకి కొత్తదనం, ప్రత్యేతకలు కనిపిస్తున్నాయి. అయితే సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రం ఏది వచ్చినా ఓ మాట కచ్చితంగా సోషల్ మీడియాలో వినిపిస్తోంది.. అదే ట్రోలింగ్.
కావాలంటే మీరే ‘ఇడుపు కాయితం’ టైమ్ లైన్ చూడండి. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి.. ఇప్పుడు ‘గడప..’ పాట వచ్చేంతవరకు.. ఎప్పుడూ ఏదో ఒక డిస్కషన్ సోషల్ జరుగుతూనే ఉంది. అందులోనూ ఎక్కువగా ఆ అంశాలు సినిమా నేపథ్యమైన తెలంగాణ అలవాట్లు, మాటలు, చేతలు చుట్టూనే తిరుగుతున్నాయి. తాజాగా వచ్చిన ‘గడప..’ పాటలో ఓ సీన్‌లో మద్యాన్ని నీళ్ల క్యాన్‌లో పోసి మరీ అందరికీ సర్వ్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
నిజానికి, పెళ్లి తర్వాత జరిగే 16 రోజుల పండగ నాడు తెలంగాణ ప్రాంతంలో మద్యం, మాంసాహారం పక్కాగా ఉంటుంది. అయితే అందరూ అని కాదు కానీ.. తెలంగాణలో మేజర్ కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితి చూస్తారు. ఇదే ఆంధ్రప్రదేశ్‌లో అయితే మద్యం, మాంసాహారం బహిరంగంగా ఉండవు. క్లోజ్డ్ ఫ్యామిలీ సభ్యులు ఇంట్లో చేసుకుంటారు కొంతమంది. మరికొంతమంది అయితే పూర్తిగా ముట్టుకోరు. దీంతో మరోసారి ఆంధ్రప్రదేశ్ వర్సెస్ తెలంగాణ అనే చర్చకు తెరలేపారు.
అయితే, ఇలాంటి చర్చ సోషల్ మీడియాలో తక్కువగానే ఉన్నా.. కొంతమంది కావాలనే ఈ పాయింట్‌ని హైలైట్ చేస్తున్నారు. ‘ఇడుపు కాయితం’ అనే పదానికి అర్థం కూడా కొంతమందికి తెలియక అడిగితే.. దానినీ పెద్ద ఇష్యూ చేశారు. ఇదంతా చూస్తుంటే సినిమా చుట్టూ ఎవరో కావాలనే ఇలా ఇష్యూలు క్రియేట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. సినిమాలో అంతటి ఎంగేజ్ అయ్యే కథ ఉన్నా.. ఇలాంటి రచ్చ ఎందుకు ముందుకు వస్తోందో అర్థం కావడం లేదు.