నాగార్జునతో ‘శిరిడిసాయి’ ‘ఓం నమో వెంకటేశాయ’ వంటి 2 మైథలాజికల్ సినిమాలు నిర్మించిన మహేష్ రెడ్డి కుమారుడు అనీష్ హీరోగా లాంచ్ అవుతూ చేసిన చిత్రం ‘ఇట్లు అర్జున'(Itlu Arjuna). ‘వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై వెంకీ కుడుముల ఈ చిత్రాన్ని నిర్మించగా మహేష్ ఉప్పాల దర్శకత్వం వహించారు. అనశ్వర రాజన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి తమన్ సంగీతం అందించాడు. ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన పాటలు.. సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి.
టీజర్, ట్రైలర్ వంటివి కూడా పర్వాలేదు అనిపించడంతో ‘ఇట్లు అర్జున’ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే రామ్ చరణ్, ఎన్టీఆర్ ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడం, నాగార్జున సమర్పకుడిగా వ్యవహరించడంతో ట్రేడ్ లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్రీమియర్స్ తోనే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో వసూళ్లు పర్వాలేదు అనిపించాయి. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
| నైజాం | 0.63 cr |
| సీడెడ్ | 0.08 cr |
| ఆంధ్ర(టోటల్) | 0.38 cr |
| ఏపీ +తెలంగాణ(టోటల్) | 1.09 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.29 cr |
| ఓవర్సీస్ | 0.25 cr |
| వరల్డ్ వైడ్ టోటల్ | 1.63 cr |
‘ఇట్లు అర్జున’ సినిమాకి రూ.10 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొరకు రూ.11 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 రోజుల్లో ఈ సినిమా రూ.1.63 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.3 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.9.37 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.