మ్యాన్లీ హీరో జగపతి బాబు (Jagapathi Babu) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోగా రాణించారు. అనేక బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి ‘జగపతి బాబు అంటే మరో శోభన్ బాబు..లాంటి వారు’ అనడంలో సందేహం లేదు. ‘గాయం’ వంటి సినిమాలు చేసి మాస్ ఆడియన్స్ ని కూడా మెప్పించారాయన. 2007 వరకు జగపతి బాబు హవా నడిచింది. అయితే ఆ తర్వాత కొత్త హీరోలు ఎంట్రీ ఇవ్వడం వల్ల..
జగపతి బాబు హీరోగా నెట్టుకు రాలేక పోయారు. కొన్నాళ్ళకి ఆ విషయాన్ని కూడా ఆయన గ్రహించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు. ‘లెజెండ్’ (Legend) సినిమా… ఆయన సెకండ్ ఇన్నింగ్స్ కి మంచి బూస్టప్ ఇచ్చింది. ‘రంగస్థలం’ (Rangasthalam) సినిమా అయితే వేరే భాషల్లో కూడా ఛాన్సులు రావడానికి సాయపడింది. అయితే జగపతి బాబు హీరోగా చేసినప్పుడు చూసుకున్నా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నప్పుడు చూసుకున్నా.. ఆయన ఫిజిక్ విషయంలో మాత్రం మార్పు కనిపించలేదు.
ఒకప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికీ అలానే ఉన్నారు. విచిత్రంగా ఈ మధ్య ఆయన ఇంకా తగ్గిపోయారు. ఇక ఆయన ఫిట్నెస్ సీక్రెట్ గురించి తన సోషల్ మీడియా ఖాతాలో వీడియోలు చేస్తున్నారు జగపతి బాబు. ఈ క్రమంలో ఆయన తన బ్రేక్ ఫాస్ట్ గురించి చేసిన వీడియో హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకంటే.. ఆయన బ్రేక్ ఫాస్ట్ కి ముందు పచ్చి కాకరకాయ జ్యూస్ తీసుకుంటారట.
అది కాకుండా పచ్చి బెండకాయ రసం కూడా తీసుకుంటున్నట్లు తెలిపారు. ‘అవి సూపర్ చండాలంగా ఉన్నాయి’ అంటూ ఆయన స్టైల్లో కామెంట్ కూడా పెట్టారు. జగపతి బ్రేక్ ఫాస్ట్ మెనూ వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి :
Walking chessi Maddigunna laaga unna. Edhi kavvalantey Adi annukondi… pic.twitter.com/Z3EL8sJ0rg
— Jaggu Bhai (@IamJagguBhai) September 25, 2024