Vettaiyan: అమితాబ్ డబ్బింగ్.. తెలుగులో కాస్త బెటర్..!

  • September 25, 2024 / 09:54 PM IST

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth)  ‘జైలర్’  (Jailer)  తో బ్లాక్ బస్టర్ కొట్టి ఫామ్లోకి వచ్చారు. దీంతో ఆయన నెక్స్ట్ మూవీ ‘వేట్టయన్’- ది హంటర్ (Vettaiyan)  పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ‘జై భీమ్’ తో దర్శకుడిగా తనదైన ముద్ర వేసుకున్న టి.జె.జ్ఞానవేల్  (T. J. Gnanavel)   తెరకెక్కించిన సినిమా ఇది. అమితాబ్ బచ్చన్  (Amitabh Bachchan) , రానా దగ్గుబాటి (Rana) ,ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) , వంటి స్టార్లు ఈ సినిమాలో నటించారు. తెలుగు నటుడు రావు రమేష్ (Rao Ramesh) కూడా సినిమాలో కీలక పాత్ర పోషించారు.

Vettaiyan

ఒక్క టైటిల్ ని పక్కన పెడితే.. ఇది డబ్బింగ్ సినిమా అనే ఫీలింగ్ కలగకుండా క్యాస్టింగ్ చేస్తుంది. అనిరుధ్ (Anirudh Ravichander) ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఈ మధ్యనే ‘మనసిలాయో’ అనే పాట రిలీజ్ అయ్యి చార్ట్ బస్టర్ అయ్యింది. సోషల్ మీడియాలో అది తెగ వైరల్ అవుతుంది. అలాగే ‘వేట్టయన్’ ప్రివ్యూ పేరుతో ఇటీవల తమిళ టీజర్..ను రిలీజ్ చేశారు. అది చూసిన తెలుగు ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఎందుకంటే టీజర్ అంతా బాగానే ఉన్నా..

అమితాబ్ బచ్చన్ కి ప్రకాష్ రాజ్ తో  (Prakash Raj) డబ్బింగ్ చెప్పించారు. అది అసలు సెట్ అవ్వలేదు. దీంతో సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. అయితే తాజాగా ‘వేట్టయన్’ ప్రివ్యూ పేరుతో తెలుగు టీజర్ ను కూడా వదిలారు. ఇందులో అమితాబ్ బచ్చన్ డబ్బింగ్ బాగానే ఉంది. తెలుగు వెర్షన్ కి గాను అతని పాత్రకి ఏఐ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో డబ్బింగ్ చెప్పించారట. ఇక టీజర్లో రజినీ లుక్స్, అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి అని చెప్పాలి. మీరు కూడా ఓ లుక్కేయండి :

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus